India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అవుతున్నారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలోనే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ‘ఓటింగ్ శాతం చూస్తేనే టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ పాలనపై వ్యతిరేకత కారణంగానే ఓటర్లు ఓటుతో కసి తీర్చుకున్నారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ఓటర్లు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ఓటింగ్ పెరిగింది’ అని ఆయన పేర్కొన్నారు.
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేను ఆ దేశ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. దీంతో ఆయన T20WCలో ఆడనున్నారు. గతంలో ఓ యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్‌కు 8ఏళ్ల జైలు శిక్ష విధించింది. 5లక్షల నేపాలీ రూపాయల ఫైన్ కూడా విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది.
UK పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజు నిలిచారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన నాగరాజు లేబర్ పార్టీ తరఫున పార్లమెంటరీ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉన్నారు. నాగరాజు అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు గడించారు. దశాబ్ద కాలంగా ఆయన ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో తెలుగు బిడ్డ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
షేర్ల విలువ తగ్గుతుందని అంచనా వేసి బ్రోకర్ నుంచి అప్పు చేసిన షేర్స్ మరొకరికి అమ్మడాన్ని షార్ట్ పొజిషన్ అంటారు. నిర్ణీత టైమ్ తర్వాత అంతే మొత్తం షేర్లను కొని బ్రోకర్‌కు అప్పగించాలి. ఒకవేళ అప్పటికి షేర్ ధర తక్కువ ఉంటే అది మదుపర్లకు లాభం. ఇదే ట్రిక్‌తో ఇప్పుడు లాభాలు ఆర్జించాలని FIIలు భావిస్తున్నాయి. కానీ ఒకవేళ అంచనా తప్పి షేర్ల విలువ పెరిగితే వీరు బ్రోకర్‌కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్నికల ఫలితాలపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మూడు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో వారి అభిప్రాయం బలపడినట్లు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు $4 బిలియన్ల షేర్లను విక్రయించారు. మరోవైపు నెట్ షార్ట్ పొజిషన్ల కాంట్రాక్టులు 2,13,224కు చేరాయని, 2012 తర్వాత ఆ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో సరైన పాలనావ్యవస్థ లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పరిశీలకులు నివేదిక అందించారు. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలు, తదితర అంశాలపై ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా నివేదికలు రూపొందించారు. పాలన, పోలీసు వ్యవస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాయని అంసతృప్తి వ్యక్తం చేస్తూ సీఈసీకి నివేదించారు. కాగా హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని CS, DGPని ఇప్పటికే ఈసీ ఆదేశించింది.
ఐపీఎల్ క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ & క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల టికెట్లు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి IPLT20.COM, పేటీఎం ఇన్‌సైడర్‌లో వీటిని విక్రయించనున్నారు. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో నిర్వహించనుండగా క్వాలిఫైయర్-2 మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. అహ్మదాబాద్‌లో టికెట్ ధర రూ.499 నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నైలో రూ.2000 నుంచి స్టార్ట్ అవుతుంది.
AP: ఈసీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా హాజరయ్యారు. రేపు ఢిల్లీ వెళ్లి ఇవ్వాల్సిన వివరణపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన ఈసీ.. సీఎస్, డీజీపీని వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
దేశంలో సీఏఏ అమలు తర్వాత తొలిసారి 14 మందికి కేంద్రం భారత పౌరసత్వం ఇచ్చింది. ఢిల్లీలో వారికి ధ్రువపత్రాలను జారీ చేసింది. 2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే CAA ఉద్దేశం. 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును ఇటీవల ఎన్నికల ముందు కేంద్రం అమల్లోకి తెచ్చింది. CAAను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ SBI తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. రూ.2కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లలో.. 46 రోజుల నుంచి 179 రోజుల FDపై 4.75% నుంచి 5.50%కి, 211 రోజుల నుంచి ఏడాది లోపు FDలపై వడ్డీని 6 నుంచి 6.25%కి పెంచింది. రూ.2కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లలో.. 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీ 5% నుంచి 5.25%కి, 46-179 రోజుల FDపై వడ్డీ 5.75% నుంచి 6.25%కి పెంచింది.
Sorry, no posts matched your criteria.