India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రేపటి నుంచి మే 23 వరకు ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) జరగనుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 17 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈసారి కూడా ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. https://cets.apsche.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజా సజ్జతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హీరో రామ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ విడుదల తర్వాత తేజతో చేసే సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
AP: ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రబలగాలు సైతం పహారా కాస్తున్నాయి.
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేయడం మంచిదేనని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. భారీ స్కోర్లు నమోదైనప్పుడు ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది సాయపడుతుందని చెప్పారు. గత ఏడాది ఈ రూల్ వల్ల చాలా మ్యాచులు చివరి వరకు ఉత్కంఠగా సాగాయన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి రూల్స్ ఇతర ఆటల్లోనూ ఉన్నాయని క్రికెటర్ అశ్విన్‌తో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
TG: పంటలు కోసిన తర్వాత రైతులు వరి కొయ్యలు, పంట వ్యర్థాలను కాల్చవద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అలా కాల్చడం వల్ల అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు తలెత్తి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వాటి దహనాన్ని నిరోధించేందుకు వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు, జ్ఞానవాపి, మథురలో ఆలయాలు కట్టేందుకు బీజేపీ గెలవాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ మేరకు ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్‌సభలో 300 సీట్లు గెలిస్తే బీజేపీ అయోధ్యలో రామజన్మభూమి నిర్మించిందని గుర్తుచేశారు. 400 సీట్లు గెలిస్తే మథుర, జ్ఞానవాపి ఆలయాల నిర్మాణమే కాక పీఓకేను భారత్‌లో కలుపుతామని హామీ ఇచ్చారు.
ప్లేఆఫ్స్ బెర్తుల కోసం నువ్వానేనా అన్నట్లు సాగుతున్న IPL పోరులో నేడు ఓ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్2లో ఉండాలని రాజస్థాన్ భావిస్తుంటే.. టాప్ టీమ్ RRను ఓడించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబ్ చూస్తోంది.
AP సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది.
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వృద్ధురాలు <<13235734>>టెండర్<<>> (ఛాలెంజింగ్) ఓటు వేశారు. ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, అప్పటికే ఆమె ఓటును వేరే వాళ్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులను ఆమె నిలదీశారు. ఆధారాలు చూపించి తన ఐడెంటిటీని నిర్ధారించారు. దీంతో సెక్షన్ 49(పి) ప్రకారం అధికారులు ఆమెకు ప్రత్యేక బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
TG: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. విద్యార్థులు ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. గతంలో ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్‌లో సవరణలు చేసినట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.