India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో మొదట ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ఆ పిటిషనర్‌కు సూచించింది. దీంతో సదరు వ్యక్తి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60ఏళ్లలోపు ఉండాలని BCCI తెలిపింది. కనీసం 30టెస్టులు/50వన్డేలు ఆడి ఉండాలని, లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్లు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని పేర్కొంది. లేదంటే IPL టీమ్, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టులో ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్లు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలంది. అనుభవం ఆధారంగా వేతనం ఇవ్వనున్నట్లు చెప్పింది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నజ్ముల్ హుస్సేన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: నజ్ముల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తంజిద్ హసన్ తమిమ్, షకీబుల్ హసన్, హృదయ్, మహ్మదుల్లా రియాద్, జాకీర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, మెహదీ హసన్, రిషద్ హసన్, ముస్తాఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హాసన్ షకీబ్.
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 4న అరెస్టయిన JDS MLA హెచ్‌డీ రేవణ్ణ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వగా, ఇవాళ బయటికొచ్చారు. ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తుకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ అశ్లీల వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
టీ, కాఫీలు తాగడం అదుపులో ఉంచుకోవాలని ICMR సూచించింది. ముఖ్యంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. కనీసం గంట గ్యాప్ ఉండాలని పేర్కొంది. ఆహారంలోని ఐరన్ శరీరానికి అందకుండా ఇందులోని టానిన్ అనే పదార్థం అడ్డుకుంటుందని తెలిపింది. అందుకే ఆహారానికి.. కాఫీ, టీలకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ICMR స్పష్టం చేసింది. శరీరానికి ఆక్సిజన్ అందడానికి ఐరన్ దోహదపడుతుంది.
చారిత్రక వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో పదేళ్లుగా అద్భుతమైన విజయాలు సాధించామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయని చెప్పారు.
TG: యువత, SC, ST, BCలు తమకు అండగా నిలిచారని మహబూబ్‌నగర్ BJP MP అభ్యర్థి DK అరుణ చెప్పారు. CM రేవంత్ 8సార్లు జిల్లాలో ప్రచారం చేసినా, కాంగ్రెస్ నేతలు భయపెట్టినా ప్రజలు తమవైపే నిలిచారని తెలిపారు. తాను 2-3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని పేర్కొన్నారు.
TG: రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, గ్యారంటీల అమలు కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.
వరుస గెలుపులతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే జెర్సీ నెం.18 కలిగిన కోహ్లీ టీమ్ ఈనెల 18న చెన్నైపై 18 పరుగుల తేడాతో గెలుపొందాలి. లేదా 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. దీంతో ఆర్సీబీని కాపాడేది ‘18’ నంబర్ ఒక్కటే అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
పోలింగ్ అనంతరం కూడా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘నిన్నటి పోలింగ్‌లో వైసీపీ గూండాల దాడులను టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదురించారు. పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ, పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి’ అని CBN కోరారు.
Sorry, no posts matched your criteria.