India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కోల్‌కతా మధ్య జరగనున్న మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. స్టేడియాన్ని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులు కొనసాగుతున్నాయి. దీంతో పిచ్‌పై కవర్లు కప్పేశారు. వాతావరణం క్లియర్ అయిన తర్వాతే పిచ్‌పై కవర్లు తొలగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే టాస్ పడనుంది.
బిహార్‌లో 106ఏళ్ల రామ్ నాథ్ సింగ్ అనే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెగుసారాయి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఖమ్హార్‌లో ఉన్న 144వ పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటు వేశారు. ఇదిలా ఉంటే మన హైదరాబాద్‌లోని పాతబస్తీ ఓటర్లు మాత్రం ఓటేసేందుకు ససేమిరా రామంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
AP: మంగళగిరి చైతన్యానికి మారుపేరని మరోమారు నిరూపితమైందని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ‘నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం. సా.6 గంటలకు కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల్లో వేచి ఉండటం వెల్లివిరిసిన ప్రజా చైతన్యానికి ప్రతీక. పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న నా మంగళగిరి కుటుంబసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
TG: ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకూ పూర్తి పోలింగ్ శాతం తెలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయన్నారు. ఈరోజు మొత్తం 400 ఫిర్యాదులు రాగా.. 38 FIRలు నమోదయ్యాయని వివరించారు. 1400 పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లున్నారని పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ జట్టును వీడారు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండరు. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యారు. మొయిన్ అలీ(CSK), బెయిర్‌స్టో(PBKS), సామ్ కరన్(PBKS), విల్ జాక్స్(RCB), ఫిల్ సాల్ట్(KKR), రీస్ టోప్లీ(RCB) సైతం త్వరలో టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది.
కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లినవారంతా తిరుగు పయనమయ్యారు. దీంతో చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. కాగా శని, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి కిక్కిరిసిపోయిన విషయం తెలిసిందే.
జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి. ముందుగా విడుదల చేస్తే మిగతా ఫేజ్‌ల ఎన్నికలు ప్రభావితం అవుతాయనే కారణంతో ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు విధిస్తుంది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తి కాగా జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి.
AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈసారి 80% దాటేలా కనిపిస్తోంది. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో 2009: 75.9%, 2014: 78.4%, 2019లో 79.6% మేర పోలింగ్ నమోదైంది. 2024లో సా.5 గంటలకే 67.99% నమోదవడంతో క్యూలైన్లో ఉన్న వారి ఓటింగ్ పూర్తయ్యేసరికి 80% దాటొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్‌తో దౌత్యపరంగా భారత్ మరో ముందడుగు వేసింది. ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. వచ్చే 10ఏళ్లకు కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ $120 మిలియన్లు వెచ్చించనుంది. విదేశాల్లో ఓ పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ తీసుకోవడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ గ్వాదర్ పోర్టుకు కౌంటర్‌గా భారత్ ఈ పోర్టును అభివృద్ధి చేసింది.
Sorry, no posts matched your criteria.