News May 12, 2024

1983 నుంచి వీరికే రికార్డ్ మెజార్టీ

image

2019: పులివెందుల – వై.ఎస్.జగన్ ☞90,110 (మెజార్టీ)
2014: పులివెందుల – వై.ఎస్.జగన్ ☞75,243
2009: పులివెందుల – వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ☞68,681
2004: కుప్పం – చంద్రబాబు నాయుడు ☞59,588
1999: కుప్పం – చంద్రబాబు నాయుడు ☞65,687
1994: పులివెందుల – వై.ఎస్.వివేకానంద రెడ్డి ☞71,580
1989: పులివెందుల – వై.ఎస్.వివేకానంద రెడ్డి ☞47,746
1985: జమ్మలమడుగు – శివారెడ్డి ☞57,170
1983: కాకినాడ – గోపాల కృష్ణమూర్తి ☞55,631

News May 12, 2024

IPL: లో స్కోరింగ్ మ్యాచులో CSK విజయం

image

ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో CSK విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 142 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ 42*, రచిన్ 27, మిచెల్ 22, దూబే 18 రన్స్ చేశారు. RR బౌలర్లలో అశ్విన్ 2, బర్గర్, చాహల్ తలో వికెట్ తీశారు.

News May 12, 2024

టాస్ గెలిచిన DC.. RCB బ్యాటింగ్

image

బెంగళూరు వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, రజత్ పాటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్
DC: మెక్‌గుర్క్, పోరెల్, హోప్, కుషాగ్రా, స్టబ్స్, అక్షర్, కుల్దీప్, రసిఖ్ దార్, ముకేశ్ కుమార్, ఇషాంత్, ఖలీల్

News May 12, 2024

విధేయతే కోహ్లీ రాయల్టీ: RCB

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇవాళ ఐపీఎల్‌లో 250వ మ్యాచ్ ఆడనున్నారు. ఒకే ఫ్రాంచైజీ(RCB)కి ఇన్ని మ్యాచ్‌లు ఆడటం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో మేనేజ్‌మెంట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను Xలో పోస్టు చేసింది. కోహ్లీకి విధేయతే రాయల్టీ అని రాసుకొచ్చింది. విరాట్ RCB తరఫున 7,897 పరుగులు(131.6 స్ట్రైక్ రేటు, 38.7 యావరేజ్) చేశారు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 264 సిక్సులు, 698 ఫోర్లు బాదారు.

News May 12, 2024

రేపే పోలింగ్.. WAY2NEWSలో వేగంగా అప్డేట్స్

image

రేపు నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. మొత్తంగా 10 రాష్ట్రాలు/UTల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6 నుంచి అన్ని ప్రాంతాల్లోని పోలింగ్ అప్డేట్స్‌ను WAY2NEWSలో వేగంగా తెలుసుకోవచ్చు. కచ్చితమైన సమాచారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఓటు వేయడానికి మీరు రెడీగా ఉన్నారా?
<<-se>>#ELECTIONS2024<<>>

News May 12, 2024

‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

image

AP: రాష్ట్రంలో ఓటుకు నోటు పంపిణీ చేస్తూ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో నోటుకు ఓటు వేసే ప్రసక్తే లేదంటూ కాకినాడలో ఓ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటి ముందు ‘మా ఇంట్లో 6 ఓట్లు అమ్మబడవు’ అంటూ బోర్డు ఏర్పాటు చేసింది. ఓటు విలువను తెలియజేస్తూ వారు చేసిన పని చుట్టుపక్కల వారిని ఆలోచింపజేస్తోంది.

News May 12, 2024

ఆ టైమ్‌లో స్నేహితులెవరూ నాతో లేరు: మనీషా కోయిరాలా

image

తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్నేహితులు, దూరపు బంధువులు పట్టించుకోలేదని మనీషా కోయిరాలా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మాను. పార్టీలు చేసుకోవడమే కాదు బాధలోనూ నాతో ఉంటారనుకున్నా. కానీ నాకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు నాతో ఎవరూ లేరు. దీంతో ఒంటరిగా ఫీలయ్యా. పేరెంట్స్, బ్రదర్ మాత్రమే నాకు అండగా నిలిచారు. వారే నా జీవితం’ అని పేర్కొన్నారు.

News May 12, 2024

సత్యకుమార్‌పై దూషణలు.. YCP ఎమ్మెల్యేపై కేసు

image

AP: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి‌పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 153 ,188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 12, 2024

ఢిల్లీలో మరోసారి బాంబు దాడి హెచ్చరికలు!

image

ఢిల్లీలో మరోసారి బాంబు దాడి బెదిరింపులు కలకలం రేపాయి. దేశ రాజధానిలోని రెండు ఆసుపత్రుల్లో దాడులకు పాల్పడుతామని మెయిల్స్ వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు స్కూళ్లలో బాంబు దాడికి పాల్పడుతామని మెయిల్స్ బెదిరింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

News May 12, 2024

రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.