News May 12, 2024

చిత్రాలు: పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీలోని 175 అసెంబ్లీ.. 25 పార్లమెంట్, తెలంగాణలోని 17 పార్లమెంట్.. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాలకు హెలికాప్ట‌ర్ల‌లో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

News May 12, 2024

మోదీ నామినేషన్‌కు 12 రాష్ట్రాల సీఎంలు!

image

ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు 12 మంది, 20 మంది కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. నామినేషన్‌కు ముందు భారీ రోడ్ షో నిర్వహించనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.

News May 12, 2024

పోలింగ్‌కు ఎండ దెబ్బ పోయి.. వర్షం ముప్పొచ్చింది

image

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలపడంతో ఇది పోలింగ్‌కు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎండల తీవ్రత వల్ల పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎండలు పక్కనపెడితే వర్షంతో ముప్పొచ్చింది. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటర్లు ఎండావానలను లెక్కచేయకుండా ఓటు వేసేందుకు తరలిరావాలి.

News May 12, 2024

IPL: ఎండలు హడలెత్తిస్తున్నాయ్‌గా..

image

చెన్నైలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ రాజస్థాన్‌తో మ్యాచులో CSK ఆటగాళ్లు ఎండవేడికి తాళలేకపోయారు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో గ్రౌండ్‌లోకి గొడుగులు తెప్పించుకుని సేద తీరారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆటగాళ్లకే ఇలా ఉంటే ప్రేక్షకుల పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News May 12, 2024

రేపు సెలవు కాదు.. ఓటింగ్‌ డే

image

ఓటు.. ప్రజల తలరాతను మార్చే గొప్ప ఆయుధం. సమర్థ నాయకుడిని ఎన్నుకుని మీకు ఎలాంటి పాలన కావాలో మీరే నిర్ణయించుకునే సువర్ణావకాశం. ఐదేళ్లకొకసారి వచ్చే ఆ అవకాశం ప్రజలకు రానే వచ్చింది. రేపు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఓట్ల పండుగ జరగబోతోంది. ఈ పండుగలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని సగర్వంగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. రేపు హాలిడే కాదు ఓటింగ్‌ డే అని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయండి.

News May 12, 2024

IPL: చెన్నై టార్గెట్ 142 రన్స్

image

చెన్నైతో మ్యాచులో రాజస్థాన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ మొదటి నుంచీ RR బ్యాటర్లు రన్స్ చేసేందుకు కష్టపడ్డారు. జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 రన్స్ మాత్రమే చేశారు. చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో RR ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. CSK బౌలర్లలో సిమర్‌జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు.

News May 12, 2024

యువరాజు వయసు కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు: మోదీ

image

చరిత్రలో ఎన్నడూ చూడనన్ని తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. యువరాజు(రాహుల్ గాంధీ) వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. TMC ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సందేశ్‌ఖాళీ వ్యవహారంలో నిందితులను కాపాడటానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

News May 12, 2024

చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి

image

APకి చంద్రబాబు CM కావాలంటూ ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన HYD శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి వద్ద లభించిన లేఖలో ‘నా పేరు చెవల మహేశ్. మాది ప.గో జిల్లా గూటల గ్రామం. నేను గతంలో YSR, జగన్ CM కావాలని ఇక్కడే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నా. ఇప్పుడు చంద్రబాబు CM కావాలని, పవన్, లోకేశ్ గెలవాలని నాలుక కోసుకున్నా’ అని రాశాడు.

News May 12, 2024

తల్లులతో భారత క్రికెటర్లు

image

ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. అలాగే ప్రతి కొడుకు సక్సెస్ వెనుక ఓ తల్లి ఉంటుంది. వాళ్లు ఏ రంగం ఎంచుకున్నా సపోర్ట్ చేస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తుంది. గొప్ప స్థాయికి చేరుకున్న బిడ్డలను చూసి మురిసిపోతుంది తప్ప తాను అందరికీ తెలియాలనుకోదు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా తల్లులతో భారత క్రికెటర్లు దిగిన కొన్ని అరుదైన ఫొటోలు మీకోసం అందిస్తున్నాం.

News May 12, 2024

ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. CSK పోస్ట్ వైరల్

image

చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ కోసం CSK ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ‘ఈ మ్యాచ్ తర్వాత వెంటనే వెళ్లిపోకండి. కాసేపు స్టేడియంలోనే ఉండండి. ఒక ప్రత్యేక మెసేజ్ మీ ముందుకు రాబోతోంది’ అని ట్వీట్ చేసింది. ఈ సీజన్‌లో చెన్నై వేదికగా CSKకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.