India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాకేశ్ రోషన్ సూపర్ హీరో ఫ్రాంచైజీ క్రిష్- 4 పట్టాలెక్కనుంది. ఈ ఫ్రాంచైజీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ భాగం కానున్నట్లు బీటౌన్ టాక్. గతంలో శ్రద్ధా ఒక ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘జాదూ లాంటి ఎండ కావాలి’ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి హృతిక్ స్పందిస్తూ.. ‘అతను వస్తున్నాడు – అతనికి చెప్తాను’ అంటూ రిప్లై ఇవ్వడంతో క్రిష్- 4లో శ్రద్ధా కన్ఫామ్ అంటూ కథలు అల్లేస్తున్నారు.
వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో వలసదారులు రావడంతో జనాభా నియంత్రణ కోసం స్వీడన్ సరికొత్త పథకాన్ని ప్రకటించింది. వలసదారులు స్వచ్ఛందంగా తమ దేశాన్ని వీడితే 10వేల స్వీడన్ క్రౌన్స్(రూ.80వేలు), చిన్నారులకు అందులో సగంతో పాటు ప్రయాణ ఖర్చులకు సైతం డబ్బులు ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 20 లక్షల మంది వలసదారులు ఉండగా.. వేరే దేశాల్లో పుట్టిన స్వీడన్ పౌరులు దేశాన్ని వీడాలని కోరింది.
తిరుపతిలోని TTD పరిపాలన భవనంలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో పలు డాక్యుమెంట్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. బోర్డు పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన పత్రాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ఇది కేవలం ప్రమాదమేనా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గాజాలోని జవైదా పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా చేసిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. సమీ జవాద్ అల్-ఎజ్లా అనే వ్యాపారి, అతడి ఇద్దరు భార్యలు, 11మంది పిల్లలు, మరో నలుగురు కుటుంబీకులు చనిపోయారని అల్-అక్సా ఆసుపత్రి తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ వివరించింది. కాల్పుల విరమణ ఒప్పందంపై హమాస్-ఇజ్రాయెల్ చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1227: మంగోలియా చక్రవర్తి చెంఘీజ్ ఖాన్ మరణం
1650: స్వాతంత్ర్యోద్యమకారుడు సర్వాయి పాపన్న జననం
1868: గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసి హీలియం ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త పియర్ జూల్స్ జాన్సెన్
1945: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం
1959: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జననం
2011: ఇండియన్ మెడికల్ కౌన్సిల్(సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం
* పార్సీ నూతన సంవత్సరం ప్రారంభం
తేది: ఆగస్టు 18, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:45 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:47 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:40 గంటలకు
ఇష: రాత్రి 7.55 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఆగస్టు 18, ఆదివారం
చతుర్దశి: తెల్లవారుజాము 03.04 గంటలకు
ఉత్తరాషాఢ: ఉదయం 10.14 గంటలకు
వర్జ్యం: మధ్యాహ్నం 01.53 నుంచి 03.21 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 04.38 నుంచి 04.48 గంటల వరకు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* PM మోదీతో చంద్రబాబు భేటీ.. అమరావతి, పోలవరంపై చర్చ
* ఉద్యోగుల బదిలీలకు AP ప్రభుత్వం ఆమోదం
* YCPకి ఆళ్ల నాని రాజీనామా
* స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు TG ప్రభుత్వం నిర్ణయం
* సీఎం రేవంత్ BJPలో చేరుతారు: KTR
* రుణమాఫీపై BRS, కాంగ్రెస్ మధ్య సవాళ్లు
* కర్ణాటకలో ముడా స్కామ్: సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశం
* గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధం: సిద్దరామయ్య
* బంగ్లా అల్లర్లలో 650 మంది మృతి: ఐరాస
Sorry, no posts matched your criteria.