India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగదు రూపంలో రూ.20వేలకు మించి ఎవరికీ రుణాలను ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (నాన్‌బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. IT చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఈ నిబంధనను తప్పక అమలు చేయాలని సూచించింది. డిజిటలైజేషన్‌ను మరింత ప్రోత్సహించేందుకు, నగదు చలామణి కట్టడికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దేశంలో ఓట్ల పండుగ జరుగుతోంది. మనకు ఇది ఈనెల 13న వస్తోంది. కానీ ప్రతి రెగ్యులర్ పండుగల్లాగే ఈ పండుగకూ సెలవు కదా అని అనుకుంటే మన సంగతి అంతే ఇక. మన తలరాత రాసుకునేందుకు అయిదేళ్లకు ఓసారి వచ్చే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. మన ఒక్క ఓటుతో ఏం మారుతుందిలే అని నిన్ను నువ్వే లెక్కలో నుంచి తప్పించవద్దు. దయచేసి సెలవు ఫీచర్‌ను వాడటంపై కాకుండా మన ఫ్యూచర్‌పై షో లవ్.
<<-se>>#VoteEyyiRaBabu<<>>
TG: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని కాలేజీలు ఈ షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలు ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అడ్మిషన్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వరాదని హెచ్చరించారు.
తమ మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి బాంబుల సరఫరా నిలిపేసింది. 3,500 బాంబులను పంపాల్సి ఉండగా.. తాజాగా వాటి సరఫరాను ఆపింది. బాంబులు పంపిస్తే రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడే ఛాన్స్ ఉండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. రఫాపై దాడి చేయొద్దని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. కానీ అగ్రరాజ్యం మాటలను ఇజ్రాయెల్ లెక్కచేయకపోగా.. రఫాపై దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది.
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లూ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు కలిగి ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నేడు గెలిచిన టీమ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ 17, బెంగళూరు 15 గెలిచింది.
AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజంపేటలో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
యూపీలో పది ఫలితాల్లో స్కూల్ టాపర్ కంటే 3 మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో పాండేపూర్‌కు చెందిన సాక్షికి 600 మార్కులకు 572 వచ్చాయి. స్కూల్ టాపర్‌కు 575 మార్కులు వచ్చాయి. టాపర్ కాలేదని మనస్తాపంతో సాక్షి సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’ పేరుతో గూగుల్ ఓ డిజిటల్ వాలెట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మీ పేమెంట్ కార్డులు, టికెట్లు, ఐడీలు మొదలైనవి భద్రపరుచుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ పే తరహాలో చెల్లింపులు చేసే సదుపాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా హైదరాబాద్, కొచ్చి మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్‌లో జరిగే జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నకిరేకల్ జనజాతర సభకు హాజరవుతారు. 11న కామారెడ్డి, తాండూరులో జరిగే జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.