News May 7, 2024

నువ్వు దేవుడివి సామీ!

image

మానవ అవయవాలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది చనిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో ఓ వ్యక్తి చనిపోతే అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చి నలుగురికి పునర్జన్మనిచ్చారు. 38 ఏళ్ల కిరణ్ బాబు చనిపోగా.. రెండు కిడ్నీలు, లివర్, గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చినట్లు తెలంగాణ జీవన్‌దాన్ ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చింది.

News May 7, 2024

టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఎలా ఉంది?

image

టీ20 వరల్డ్ కప్ కోసం BCCI నిన్న విడుదల చేసిన కొత్త జెర్సీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘ఔట్‌డేటెడ్ జెర్సీ’ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ‘బెస్ట్ ఎవర్’ అని అంటున్నారు. దీంతో టీమ్ ఇండియా కొత్త జెర్సీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. 2007 నుంచి ఇప్పటివరకు మారిన జెర్సీలను పోస్ట్ చేస్తున్నారు. మరి కొత్త జెర్సీ ఎలా ఉంది? అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.

News May 7, 2024

మేం ఇస్లాంకు వ్యతిరేకం కాదు: మోదీ

image

తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇటీవల మోదీ ‘చొరబాటు దారులకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు’ అని, ‘కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సొమ్ము దోచుకొని చొరబాటుదారులకు పంచాలని చూస్తోంది’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో మోదీ ముస్లింలే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలపై మోదీ తాజాగా ఇలా స్పందించారు.

News May 7, 2024

అందుకే గాడిద గుడ్డుతో పోల్చాం: CM రేవంత్

image

TG: గాడిద గుడ్డు పెట్టదనేది ఎంత నిజమో.. BJP తెలంగాణకు నిధులిచ్చిందనేది కూడా అంతే నిజమని చెప్పే ఉద్దేశంతోనే ‘గాడిద గుడ్డు’తో పోల్చామని CM రేవంత్‌ వివరించారు. ‘రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1 పన్ను వెళితే.. అందులో 43పైసలు మాత్రమే కేంద్రం తెలంగాణకు ఇస్తుంది. అదే బిహార్‌కు రూ.7.6, UPకి రూ.6 ఇస్తున్నారు’ అని రేవంత్ అన్నారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు ఇస్తే.. BJP శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

News May 7, 2024

సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే?

image

అధిక నిధులు ఉన్న దేశ ప్రభుత్వాలు సావరిన్ వెల్త్ ఫండ్స్‌ను నిర్వహిస్తాయి. తమ సంపదను పెంచుకునేందుకు SWF రూపంలో విదేశాలు/సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి. తొలి SWF 1953లో కువైట్‌‌లో ప్రారంభం కాగా ప్రస్తుతం 176 SWFలు ఉన్నాయి. భారత్‌లో 2015లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) పేరుతో SWF ప్రారంభమైంది. కువైట్, UAE, సింగపూర్ తదితర దేశాలు కీలక పెట్టుబడిదారులుగా ఉన్నాయి.

News May 7, 2024

‘ఆర్య’లో హీరోగా చేయాల్సింది ఎవరో తెలుసా..!

image

అల్లు అర్జున్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్య విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాను తనను దృష్టిలో పెట్టుకుని రాశారని అల్లరి నరేశ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘100 పర్సంట్ లవ్‌’ సమయంలో సుకుమార్, నేను కలిశాం. ‘అల్లరి’లో నా నటన నచ్చి ఆర్య కథను నా కోసం రాశానని ఆయన చెప్పారు. ఎవరికి రాసిపెట్టిన కథ వారి దగ్గరకే వెళ్తుంది. ఆర్యగా బన్నీ కంటే ఎవరూ బాగా చేయలేరు’ అని పేర్కొన్నారు.

News May 7, 2024

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే: అదానీ

image

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బిలియనీర్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘ఈరోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేసినందుకు గర్విస్తున్నా. దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఓటు వేసి మీ స్వరాన్ని వినిపించండి. భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి మీరూ ఓటు వేయండి. జై హింద్’ అని ఆయన పిలుపునిచ్చారు.

News May 7, 2024

UPI చెల్లింపులతో పెరిగిన ఖర్చులు

image

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగిపోయింది. UPI ద్వారా ఈజీగా చెల్లింపులు అవుతుండడంతో ప్రజలు వీటి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే, ఇవి వినియోగదారుల ఖర్చును విపరీతంగా పెంచుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. IIIT ఢిల్లీ ప్రతినిధులు 276 మందిపై చేపట్టిన సర్వేలో 74% మంది ఆన్‌లైన్ పేమెంట్స్ వల్ల అమితంగా ఖర్చు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. UPI చెల్లింపుల ద్వారా మీ ఖర్చు పెరిగిందా? కామెంట్ చేయండి.

News May 7, 2024

అధికారంలోకి రాగానే కులగణన: భట్టి

image

TG: బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రిజర్వేషన్లు తొలగించేందుకే ఆ పార్టీ 400 సీట్లు కోరుతోందని ఆరోపించారు. దేశంలో 90శాతం ప్రజల హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతుందని భట్టి తెలిపారు.

News May 7, 2024

అవసరమైన మ్యాచుల్లో ఆడుంటేనా?

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నిన్నటి మ్యాచులో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఆయన ప్రదర్శనపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు చురకలు అంటిస్తున్నారు. అవసరమైన మ్యాచులో తేలిపోయి.. అంతా అయిపోయాక ఇలా చెలరేగి ఏం లాభమంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే ప్రదర్శన మునుపటి మ్యాచుల్లో చూపిస్తే అలవోకగా జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లి ఉండేదని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?