India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒తేది: ఆగస్టు 17, శనివారం
✒ద్వాదశి: ఉదయం 8.05 గంటలకు
✒త్రయోదశి: ఉదయం 05.51 గంటలకు
✒పూర్వాషాడ: ఉదయం 11.48 గంటలకు
✒వర్జ్యం: రాత్రి 07.17 నుంచి 08.47 గంటల వరకు
✒దుర్ముహూర్తం: ఉదయం 5.52 నుంచి 6.43 గంటల వరకు
AP: వీఆర్‌లో ఉన్న IPSలు బెంగళూరులో మాజీ CM జగన్‌ను కలిశారని TDP నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై DGP విచారణ జరిపించాలని ఆయన కోరారు. ‘గత ప్రభుత్వ హయాంలో సీనియారిటీలో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని DGPగా నియమిస్తే ఎవరూ మాట్లాడలేదు. సంజయ్, సునీల్ కుమార్, PSR ఆంజనేయులు చరిత్ర ఐవైఆర్ కృష్ణారావు, స్వర్ణజిత్ సేన్‌కు తెలియదా? ఇప్పుడు మాట్లాడుతున్న వారందరికి అప్పుడేమైంది’ అని ఆయన మండిపడ్డారు.
* రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగట్
* రేపు వైద్య సేవలు బంద్: IMA
* తెలుగు సినిమా కార్తికేయ-2కి నేషనల్ అవార్డు
* ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. రేపు పీఎంతో భేటీ
* వయనాడ్‌కు ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయం
* విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం
* బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: TG CM రేవంత్
* కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు
TG: బీఆర్ఎస్ విలీన వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ‘బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కానుందని బీజేపీ, బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతల నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపై సమాధానం చెప్పవలసిన బాధ్యత కేసీఆర్‌కు ఉంది. రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ జవాబు చాలా అవసరం’ అని ట్వీట్ చేశారు.
తీవ్రమైన ఒత్తిడి కారణంగా కొంతమంది రోజూ ఉదయం ఆందోళన, భయంతో మేల్కొనడాన్ని ‘మార్నింగ్ యాంగ్జైటీ’ అంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్నుంచి బయటపడేందుకు రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. ఆల్కహాల్ మానేయాలి. కెఫిన్, చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి. వ్యాయామం, ధ్యానం చేయాలి. రేపటి గురించి ఆలోచించకుండా వేళకు తింటూ, హాయిగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ దారుణాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తన భార్య కడుపుపై ఘోష్ కాలుతో తన్నడంతో కుట్లు ఊడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. హత్యాచార ఘటనలో నిర్లక్ష్యం వహించారని హైకోర్టు అతడిని సెలవుపై పంపిన విషయం తెలిసిందే.
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. శ్రీలంక తరఫున డిక్‌వెల్లా 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడారు.
ఫోన్ పే/గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు TGSPDCL, APCPDCL వెల్లడించాయి. ప్రస్తుతం ఫోన్ పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్‌లు, వెబ్‌సైట్లలో బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి. మరో 4, 5 రోజుల్లో గూగుల్ పే ద్వారా కూడా స్వీకరిస్తామని పేర్కొన్నాయి. రెండు నెలల క్రితం ఫోన్ పే వంటి డిజిటల్ యాప్స్ నుంచి చెల్లింపులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
సెబీ చీఫ్ మాధబి రూల్స్‌ని బ్రేక్ చేసి ఒక కన్సల్టెన్సీ నుంచి ఆదాయాన్ని పొందారని ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ ఒక కథనంలో ఆరోపించింది. 2017లో సెబీలో చేరిన ఆమె ఏడేళ్లలో అగోరా అడ్వైజరీ ప్రై.లిలో తనకున్న 99% వాటా ద్వారా రూ.37.1 మిలియన్లు ఆర్జించినట్టు వెల్లడించింది. ఇది ఇతర వృత్తుల నుంచి జీతం, ఆదాయం పొందకూడదన్న 2008 సెబీ ఉద్యోగుల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుందని పేర్కొంది.
ఐపీఎల్‌లో ప్లేయర్ల రిటైనింగ్‌పై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో స్టార్ ప్లేయర్ ధోనీని CSK అన్‌క్యాప్డ్ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్లేయర్లను అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా గుర్తించే నిబంధనకు BCCI అనుమతించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇదే నిజమైతే తక్కువ ధరకే మిస్టర్ కూల్‌ని సీఎస్కే సొంతం చేసుకునే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.