India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించింది. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్, HOD ఉద్యోగులకు ఉచిత వసతిని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి 2024, జూన్ 27 నుంచి 2025, జూన్ 26 వరకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్న విజేతలకు నటుడు యష్ అభినందనలు తెలిపారు. ‘హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ తెరకెక్కించిన కాంతార, KGF-2కి అవార్డులు రావడం సంతోషం. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేక అభినందనలు. ఇంకా మరిన్ని విజయాలు అందుకోవాలి. జాతీయ వేదికపై కన్నడ సినిమా మెరిసింది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లా మధ్యంతర ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఇరువురూ చర్చించుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మెరుగుపడేందుకు అవరసమైన సహకారాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. బంగ్లాలోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణకు చర్యలు చేపడతామని యూనస్ తనతో చెప్పినట్లు మోదీ ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి CM అభ్యర్థిగా కాంగ్రెస్, శరద్ పవార్ NCPలు ఎవర్ని ప్రకటించినా మద్దతు ఇస్తామని శివసేన UBT చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ‘సీఎం అభ్యర్థిపై గతకొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. కూటమిలోని నేతలకు నేను చెప్పేది ఒక్కటే. పృథ్విరాజ్ చవాన్, శరద్ పవార్‌లు ఎవరి పేరును ప్రకటించినా బేషరతుగా మద్దతు ఇస్తాను’ అని ఉద్ధవ్ తెలిపారు.
దేశంలో ఇటీవల వైద్య సిబ్బందిపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం వైద్య సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడి చేస్తే ఇన్‌స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఘటన జరిగిన 6 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలని లేదంటే సంస్థ హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానల్ ఫేక్ న్యూస్‌కు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది’ అని ట్వీట్ చేసింది. ‘కేసీఆర్‌కు తీవ్ర అస్వస్థత’ అని టీకాంగ్రెస్ ఛానల్‌లో వచ్చినట్లు ఓ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. ఆ వార్త అవాస్తవమని స్పష్టం చేసింది.
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మా ఆనందం’గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణలో బ్రహ్మీ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ నెల 19న మధ్యాహ్నం 12:34 గంటలకు గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
TG: బీజేపీలో BRS విలీనం అవుతుందన్న CM రేవంత్ <<13869151>>వ్యాఖ్యలకు<<>> బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో BRS విలీనం తథ్యమని జోస్యం చెప్పారు. KCRకు AICC, కేటీఆర్‌కు PCC చీఫ్ పదవులు, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. BRSను బీజేపీలో విలీనం చేస్తేనే కవితకు బెయిల్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసుల్లో KCR, KTRను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
2014లో చివరిసారి JK అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2018లో PDP-BJP ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గవర్నర్ పాలన అమలులోకి వచ్చింది. 6 నెలల తరువాత రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. JK, లద్దాక్ రెండు UTలుగా ఏర్పాటయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్థించి Sep30 లోపు ఎన్నికలు నిర్వహించాలంది. దీంతో EC షెడ్యూల్ ప్రకటించింది.
హరియాణాలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 4న ఫలితాల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి వచ్చే నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.