India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘సలార్’ పార్ట్-2 షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. తొలి షెడ్యూల్‌లో 10 రోజులపాటు ప్రభాస్, పృథ్వీరాజ్‌లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దీనికోసం HYDలో ప్రత్యేక సెట్ వేసినట్లు సమాచారం. తొలుత ప్రభాస్ సీన్లు పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో మిగతా షూటింగ్ పూర్తిచేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. 2025 చివర్లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
కర్నూలు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కోడుమూరు. తొలి నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 1962 నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తొమ్మిది సార్లు, స్వతంత్ర పార్టీ, టీడీపీ ఒక్కసారి నెగ్గాయి. 2014 నుంచి ఈ సీటు వైసీపీ వశమైంది. మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీశ్ ఈసారి పోటీలో ఉన్నారు. బొగ్గుల దస్తగిరిని బరిలోకి దింపిన టీడీపీ ఇక్కడ ఎలాగైనా జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు పక్కకెళ్లాయని CM రేవంత్ తెలిపారు. ‘ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అనే అంశాలపైనే జరుగుతున్నాయి. నేను మోదీ, అమిత్ షాల కంటే చిన్నవాడినే కావొచ్చు. కానీ పోలీసులతో నన్ను బెదిరించాలని చూస్తే.. అది మాత్రం జరగదు. కావాలంటే ఒకాయన ఈ రాష్ట్రంలోనే ఫ్రీగానే ఉన్నాడు. ఆయనను వెళ్లి అడగండి. నన్నే భయపెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి’ అని సూచించారు.
కార్పొరేట్ కల్చర్‌లో ఇప్పుడు ‘ఆఫీస్ పికాకింగ్’ అనే మరో ట్రెండ్ చేరింది. వర్క్‌ఫ్రమ్ ఆఫీస్‌కు వ్యతిరేకంగా నామమాత్రానికి ఆఫీసుకు వచ్చి వెళ్లిపోయే ‘కాఫీ బ్యాడ్జింగ్’ ట్రెండ్‌ను కొందరు ఉద్యోగులు నడిపారు. ఇందుకు కౌంటర్‌గా ఇప్పుడు యజమాన్యాలు ఈ ‘ఆఫీస్ పికాకింగ్’ ట్రెండ్ తెచ్చాయి. లగ్జరీ సోఫాలు, ఆహ్లాదకరమైన మొక్కలు, లాంజ్ స్టైల్‌లో క్యుబికల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయట.
TG: రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా రికార్డయినట్లు వాతావారణ శాఖ తెలిపింది. మరో 3 రోజులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
TG: ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని CM రేవంత్ మండిపడ్డారు. ‘దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద నాపై కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారు కాబట్టి నా కేసు కోసం వారిని ఎంచుకున్నారు’ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే కచ్చితంగా రిజర్వేషన్లను రద్దు చేస్తారని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.
TG: రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే RSS మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేయడమే BJP అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంపై సమీక్షించాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రసంగ సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉంది. ఆధారాలతో సహా నేను వాదిస్తున్నా. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు’ అని రేవంత్ తెలిపారు.
తాను పేదల పక్షాన నిలుస్తుంటే కూటమి నేతలు సహించలేకపోతున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘ఇదొక క్లాస్ వార్. పేదలకు పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ రావాలి. పిల్లల చదువుల కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెచ్చాం. ఏకంగా 2.70లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకమైనా గుర్తొస్తుందా? గతంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబుని మళ్లీ నమ్ముతారా?’ అని ప్రశ్నించారు.
హీరామండీతో మరోసారి అలరించిన నటి మనీషా కోయిరాలా లవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితంలో ఓ తోడు ఉంటే బాగుంటుంది అని అనిపించేది. భాగస్వామి ఉండటం మంచి విషయమే. కానీ ఆ పార్ట్‌నర్ కోసం ఎదురుచూసి సమయం వృథా చేసుకోను. మనకి రాసిపెట్టి ఉంటే వస్తారు. ప్రస్తుతం జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’ అని తెలిపారు. కాగా 2010లో సామ్రాట్ దహల్ అనే వ్యాపారవేత్తతో మనీషా వివాహం కాగా 2012లో వారు విడిపోయారు.
టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘నా జీవితంలోకి నువ్వు రాకపోయి ఉంటే నేను చాలా కోల్పోయేవాడిని. హ్యాపీ బర్త్ డే మై లవ్. నా ప్రపంచంలో నువ్వు వెలుగునిచ్చే దీపానివి’ అని అతడు ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. దీనికి భార్యతో కలిసున్న పలు ఫొటోలను జత చేశారు.
Sorry, no posts matched your criteria.