India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళ నటుడు జయం రవి తన భార్యతో విడిపోవడం వెనుక గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి తాజాగా స్పందించారు. ‘దయచేసి ఇందులోకి ఎవరి పేరునూ లాగొద్దు. వ్యక్తిగత జీవితాల్ని గౌరవించండి. చాలామంది చాలా అంటున్నారు. కెనీషా 600కు పైగా స్టేజీ షోల్లో పాడిన గాయని. కష్టపడి పైకొచ్చింది. ఆమెను ఈ వివాదంలో దయచేసి ఇన్వాల్వ్ చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్‌కు సంబంధించి అన్ని ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వరకు గడువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.
AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4 వరకు ఆయన అమెరికా, జపాన్‌లో పర్యటిస్తారు. ఆయనతోపాటు అధికారుల బృందం కూడా వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పో, ప్రముఖ కంపెనీల సందర్శన, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. 28 వరకు అమెరికాలో, 29 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో పర్యటిస్తారు.
అయోధ్య రామ మందిరంలో జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పంపిణీ చేసిన ప్రసాదం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు తిరుమల లడ్డూలను ప్రసాదంగా పంచారని ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ చెబుతున్నారు. లడ్డూ కల్తీ నివేదికలు ప్రమాదకరమైన కుట్రను సూచిస్తున్నాయన్నారు. అయితే ఆ రోజు యాలకుల గింజలు మాత్రమే ప్రసాదంగా పంచినట్టు ఆలయ ట్రస్టు చెబుతోంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
ముఖ్యమంత్రి ఆతిశీ క్యాబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్లకు మంత్రి పదవి దక్కింది. LG వీకే సక్సేనా వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ముకేశ్ అహ్లావత్ మినహా మిగిలిన నలుగురు అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వారే కావడం గమనార్హం.
విదేశీ విద్య కోసం US, కెనడా, ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకొనే ధోరణికి ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు స్వస్తిపలుకుతున్నారు. ఈ దేశాల కంటే తక్కువ జీవన వ్యయాన్ని, ట్యూషన్ ఫీజులను ఆఫర్ చేస్తున్న యూరోపియన్ దేశాలపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పైగా లిబరల్ లైఫ్‌స్టైల్‌ను కాంక్షిస్తూ దక్షిణాసియా విద్యార్థులు ఎక్కువగా యూరప్‌లో చదివేందుకు, స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
TG: నిబంధనల ప్రకారమే సీనియర్ సభ్యుడు అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఏసీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. గత పదేండ్లలో జరిగిన ఖర్చులను పీఏసీ తేల్చుతుందని పేర్కొన్నారు.
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై BJP అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. సిక్కులు, ఇతర మతాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయంలో BJP తన నోరునొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ‘సిక్కులు తలపాగా, కడియం ధరించవచ్చా? వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా? అనే వాటిపైనే దేశంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలదీ ఇదే పరిస్థితి’ అని గతంలో రాహుల్ అన్నారు.
Sorry, no posts matched your criteria.