India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
UPలోని లఖీంపుర్ ఖేరీలో అమన్(22) ఓ యువతిని(17) ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఈనెల 19న బంధించి 3రోజులు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. ఎట్టకేలకు బాధితురాలు ఆ చెర నుంచి బయటపడటంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అతడు HYDలోని ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
అవినీతి ఈరోజుల్లో సర్వసాధారణంగా పరిగణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రధాని మోదీ. ‘ఒకప్పుడు ఆరోపణలే దేశాన్ని కుదిపేసేవి. కానీ ఇప్పుడు నేరం రుజువై శిక్ష అనుభవించినా కొందరు చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. అది అవినీతిని గొప్పగా చెప్పుకుంటున్నట్లు కాదా? అవినీతిని సర్వసాధారణంగా పరిగణించొద్దు. అలా చేస్తే దేశానికి ఎంతో నష్టం. ఇది కేవలం బీజేపీ vs ప్రతిపక్షాలు కాదు’ అని పేర్కొన్నారు.
బీజేపీతో చేతులు కలిపితే నేతలపై ఉన్న కేసులు తొలగిపోతాయని, ఆ పార్టీ ‘వాషింగ్ మెషీన్’ అని వస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. BJPలో చేరిన 25 మందిలో 23 మందిపై దర్యాప్తు నిలిచిపోయిందన్న ఓ మీడియా కథనంపై స్పందిస్తూ.. ఒక్క కేసు దర్యాప్తు కూడా ఆగలేదన్నారు. ‘కోర్టులు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. అయినా ఇలాంటి కేసులు కేవలం 3శాతమే ఉన్నాయి. వాటి విషయం ఏజెన్సీలు, కోర్టులు చూసుకుంటాయి’ అని తెలిపారు.
TG: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఏఐసీసీ నేత, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటు త్వరలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల సూరత్ MP స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. విలువైన ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మంచి చేస్తామని నేతలు అంటుంటారు. మరి ఏకగ్రీవంలో ఓట్లు ఉండవు. నాయకులెలా బాధ్యతగా ఫీల్ అవుతారు? ఏకగ్రీవం అయిన స్థానాల్లో ఎంతో విలువైన ప్రజల ఓటు హక్కు వృథా అయినట్లేగా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ ఏకగ్రీవంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. <<-se>>#ELECTIONS2024<<>>
దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు సున్నా చేయడమే తన లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. ‘అందరి ఇళ్లకు కరెంటు బిల్లు సున్నా కావాలి. మిగులు విద్యుత్‌తో ఆదాయం రావాలి. ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలి. సోలార్ కనెక్షన్లు వస్తే ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది. పెట్రోల్, డీజిల్ కోసం నెలకు అయ్యే రూ.1000-2000 ఖర్చు కూడా ఉండదు’ అని పేర్కొన్నారు.
APలో మే 1 నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులెవరూ పెన్షన్ కోసం గ్రామ/వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక పెన్షన్ పొందేవారు, వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తారని.. మిగతా వారికి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
హరియాణాకు చెందిన ధ్రువ్ రాఠీ ఇండియాలో టాప్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందారు. యూట్యూబ్‌లో ఆయనకు 18.7M సబ్స్క్రైబర్లున్నారు. సామాజిక, రాజకీయ విశ్లేషణలతో పాపులర్ అయ్యారు. కుండబద్దలుకొట్టే మాటలతో టాప్ పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగారు. ‘తదుపరి తరం నాయకులు-2023’ జాబితాలో టైమ్ మ్యాగజైన్ చోటు కల్పించింది. ఇటీవల అతడు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేయడంతో ట్రెండ్ అవుతున్నారు.
కర్ణాటక చామరాజనగర్ MP శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. చామరాజనగర్ నుంచి 6 సార్లు ఎంపీగా, 2 సార్లు MLAగా గెలిచిన ఆయన మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదల కోసం తన జీవితాన్ని ప్రసాద్ అంకితం చేశారని.. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ ఆకాంక్షించారు.
TG: కాంగ్రెస్ MLC, నిజామాబాద్ MP అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి BJP ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్ఫింగ్ వీడియోను జీవన్‌రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ‘కేంద్రంలో BJP మళ్లీ అధికారంలోకి వస్తే SC, ST, OBC రిజర్వేషన్లు ఎత్తేస్తాం’ అని అర్థం వచ్చేలా వీడియో ఉందని.. దీన్ని వైరల్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Sorry, no posts matched your criteria.