India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. దీనిని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ఫొటోలు వైరలవుతున్నాయి. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ‘తాజ్‌మహల్ కనిపించట్లేదు.. ఎక్కడుందో కనిపెట్టాలి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.

భారత స్టాక్‌మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్లకు సెలవు. కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. దీంతో మార్కెట్ వర్గాలకు 3 రోజుల విరామం లభించినట్టైంది. ప్రస్తుతం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా రెండోవారమూ పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2%, బ్యాంకు నిఫ్టీ 3% తగ్గాయి.

TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లకు ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 22 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

రేపు గురునానక్ జయంతి – కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలీడే ఉంది. అన్ని రకాల విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో శుక్రవారం ఆప్షనల్ హాలీడే మాత్రమే ఇచ్చారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ప్రత్యేక ఆహారంతో పాటు పరిరక్షణ, వసతి కోసం చైనాలోని ఆరేళ్ల జెయింట్ పాండా తాను గర్భం దాల్చినట్లు జూకీపర్లను నమ్మించింది. జూలో గర్భం దాల్చిన పాండాలకు 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స లభిస్తుంది. అయితే, 2 నెలల పరిశీలన తర్వాత అది సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు తెలిపారు. కొన్ని తెలివైన పాండాలు ఇలా నటిస్తాయని అభిప్రాయపడ్డారు. హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ఒక్కోసారి ఇలా జరగొచ్చని పేర్కొన్నారు.

మీరు జన్మించిన తేదీని బట్టి మీ వెనక దేవతలుంటారని పురాణాలు చెబుతున్నాయి. 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు విష్ణువు మార్గదర్శకత్వంలో ఉంటారని ప్రతీతి. వీరు ఇతరులకు సహాయం చేస్తారని, సహజంగానే నాయకత్వ లక్షణం కలిగి ఉంటారని విశ్వాసం. జీవితంలో బలమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారని, విష్ణువు వీరికి జ్ఞానం, సహనాన్ని వరంగా ఇస్తారని నమ్ముతుంటారు. ఆయన రక్షణగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తారంటుంటారు. మీ DOB ఏంటి?

TG: కులగణనపై అపోహలు తొలగించే బాధ్యతను విద్యార్థులే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎవరు అడ్డుపడ్డా కులగణన ఆగదు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి దీనిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల 50శాతానికిపైగా రిజర్వేషన్లు వస్తాయి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి’ అని ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవంలో సీఎం పేర్కొన్నారు.

Ola Electric నాణ్యతా, సర్వీసు ప్రమాణాల లోపం ఆరోపణలపై Bureau of Indian Standards విచారణ జరుపుతుందని వినియోగదారుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. యూజర్ల నుంచి 10 వేలకుపైగా ఫిర్యాదులు అందడంపై వివరణ ఇవ్వాల్సిందిగా CCPA గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే అవి కేవలం సాఫ్ట్‌వేర్ వినియోగం అర్థంకాకపోవడం, లూస్ పార్ట్స్ సమస్యలని ఓలా పేర్కొంది. అయితే, దీనిపై విచారణ బాధ్యతను BISకు CCPA అప్పగించింది.

TG: గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై CM రేవంత్ స్పందించారు. గురుకులాలకు నాసిరకం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటివారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూల్స్‌ను సందర్శించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.