India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో <<14606404>>ఆత్మహత్య<<>> చేసుకున్న జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా’ అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.

రంజీల్లో గోవా జట్టు సంచలనం సృష్టించింది. రంజీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకుని రికార్డులకెక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫీట్ సాధించింది. ఈ క్రమంలో అస్సాం (త్రిపుర-ఇన్నింగ్స్ 472/1991) రికార్డును అధిగమించింది. ఆ తర్వాత బొంబాయి (సింధ్-ఇన్నింగ్స్ 453/1947), మేఘాలయ (మిజోరం-ఇన్నింగ్స్ 425/2020), బెంగాల్ (అస్సాం-ఇన్నింగ్స్ 413/1952) ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు గురువారం తేరుకుంటున్నట్టు కనిపించినా ఉదయం 11 తరువాత Sharp Fall రావడంతో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,532 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా ఆరో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాల్లో నిలిచాయి. అయితే, సెన్సెక్స్‌కు 77,400 వద్ద, నిఫ్టీకి 23,500 పరిధిలో కీలక మద్దతు లభించడంతో సూచీలు Sideways వెళ్లాయి.

AP: రఘురామకృష్ణం రాజు ఉపసభాపతిగా ఉంటే రాష్ట్రానికి పట్టిన కీడు తొలగిపోతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆయన ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలన్న కోరిక దుష్ట శక్తుల్లో చచ్చిపోతుందని చెప్పారు. ‘అసెంబ్లీకి వస్తుంటే ఎవరు ఏమడుగుతారోనని స్కూల్‌కి వస్తున్నభావన ఉంది. YCP సభ్యులకు అలా అనిపించటం లేదు. ముందే వారు సభకు మొహం చాటేశారు. RRRను అధ్యక్షా అని పిలిచే అవకాశాన్ని జగన్ కోల్పోయారు’ అని పేర్కొన్నారు.

* వైస్ ప్రెసిడెంట్ – జేడీ వాన్స్
* గవర్నమెంట్ ఎఫిషియన్సీ అడ్వైజర్స్ – మస్క్, వివేక్ రామస్వామి
* డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ – తులసీ గబ్బార్డ్
* సెక్రటరీ ఆఫ్ స్టేట్ – మార్కో రూబియో
* అటార్నీ జనరల్ – మ్యాట్ గేజ్
* డిఫెన్స్ సెక్రటరీ – పేట్ హెసెత్
* నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – మైక్ వాల్ట్జ్
* వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ – సూసీ వైల్స్

AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హత వేటు చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల వేళ నేతల దురుసు వ్యాఖ్యల చుట్టూ రాజకీయం నడుస్తోంది. MHలో శివసేన నాయకురాలు శైనాను ఉద్ధవ్ పార్టీ నేత అర్వింద్ సావంత్ ‘దిగుమతి సరుకు’ అని విమర్శించడం దుమారం రేపింది. కుమార స్వామిపై మంత్రి అజ్మీర్ ‘కాలియా’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. UP CM యోగి వస్త్రధారణపై ఖర్గే వ్యాఖ్యలు, BJPని కుక్కలా మార్చాలని నానా పటోలే అనడం వివాదం రేపింది. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలే రాజకీయాన్ని నడుపుతున్నాయి.

రంజీ ట్రోఫీలో గోవా బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న ప్లేట్ మ్యాచ్‌లో కశ్యప్ బాక్లే (300*), స్నేహాల్ కౌతాంకర్ (314*) కలిసి మూడో వికెట్‌కు 606 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధికం. వీరిద్దరూ చెలరేగడంతో గోవా 727/2 పరుగులకు డిక్లేర్ చేసింది. అరుణాచల్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 88 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 20/3తో ఆడుతోంది.

TG: త్వరలో గ్రూప్-4 ఫలితాలు వస్తాయనే వార్తల నేపథ్యంలో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిల్చితే మెరుపు ధర్నా చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ‘గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా రిజల్ట్స్ ఇస్తే ఆందోళనలు చేస్తాం. దీనిపై గతంలోనే మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలిశాం. గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలడంతో 2000 మందికి అన్యాయం జరిగింది. గ్రూప్-4లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి’ అని కోరారు.

సినీ నటుడు రామ్ చరణ్ కడప అమీన్ దర్గాను ఈ నెల 18న దర్శించుకోనున్నారు. అక్కడ జరిగే 80వ దర్గా నేషనల్ ఘజల్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాగా.. శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఉప్పెన’ బుచ్చిబాబు డైరెక్షన్లో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.