News August 15, 2024

కర్ణాటక SBI, PNBలో అకౌంట్లు ఎందుకు క్లోజ్ చేస్తోందంటే..

image

SBI, PNBలో అన్ని ఖాతాలను మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని, ఇకపై లావాదేవీలు చేపట్టొదని ప్రభుత్వ శాఖలు, సంస్థలను ఆదేశించింది. KIADB చేసిన రూ.12 కోట్లు, KSPCBకి చెందిన రూ.10 కోట్ల డిపాజిట్ల అవినీతిలో తమ ఉద్యోగుల పాత్ర ఉందంటూ బ్యాంకులు డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేదు. బ్యాంకు అధికారులతో చర్చలూ విఫలమవ్వడంతో విషయం న్యాయ పరిధిలోకి వెళ్లింది.

News August 15, 2024

అక్కడ మహిళలకు నెలసరి సెలవు

image

పంద్రాగస్టు రోజున ఒడిశా ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు ఒక రోజు నెలసరి సెలవు ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతీ పరిదా ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పీరియడ్స్‌లో తొలి రోజు లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

News August 15, 2024

రుణమాఫీ కాలే.. రాహుల్ గాంధీ రాలే: కేటీఆర్

image

TG: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి తీర్పు ఎప్పుడైనా రావొచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందనేది ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు. పంద్రాగస్టు‌లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రుణమాఫీ కాకపోవడంతోనే రాహుల్ గాంధీ రాలేదని విమర్శించారు.

News August 15, 2024

ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్ల దోపిడీ: రేవంత్

image

TG: కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.

News August 15, 2024

PIC OF THE DAY: కూతురుతో పవన్ సెల్ఫీ

image

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు. కాకినాడలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ వేడుకకు కూతురు ఆద్యతో కలిసి వచ్చారు. ఈక్రమంలో స్టేజీపై కూతురుతో సెల్ఫీ తీసుకున్నారు. తండ్రి మొబైల్‌లో సెల్ఫీ తీస్తుంటే కూతురు మురిసిపోతూ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్య అంటే పవన్‌కు ఎంతో ఇష్టమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News August 15, 2024

GREAT: ఒంటిపై 631మంది అమరవీరుల టాటూలు!

image

ఇష్టమైనవారి పేర్లు పచ్చబొట్టు వేయించుకోవడం కామనే. కానీ యూపీకి చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి 631మంది అమరవీరుల ఫొటోలు, పేర్లను పచ్చబొట్టు వేయించుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ సహా భారత జవాన్లు, స్మారక చిహ్నాల ఫొటోలు వీటిలో ఉన్నాయి. గత ఏడాది లద్దాక్ వెళ్లినప్పుడు ఓ జవాను తమను రక్షించారని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమ్ తెలిపారు.

News August 15, 2024

జనాభా తగ్గుదలపై సీఎం చంద్రబాబు ఆందోళన

image

AP: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో CM చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈమధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి’ అని పిలుపునిచ్చారు.

News August 15, 2024

ఒలింపిక్ అథ్లెట్లకు అందుబాటులో కొత్త NCA: జైషా

image

నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ అథ్లెట్లూ కొత్త NCAను ఉపయోగించుకోవచ్చని BCCI కార్యదర్శి జైషా అన్నారు. ఇందులో అధునాతన వసతులు ఉంటాయన్నారు. వారణాసిలో స్టేడియం, జమ్ము- ఈశాన్య రాష్ట్రాల్లో 7 NCAలు నెలకొల్పుతామని ప్రకటించారు. బెంగళూరు NCAలో ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టీస్, ఇండోర్ క్రికెట్ పిచ్‌లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, అద్భుతమైన ట్రైనింగ్, రికవరీ, స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యాలు ఉంటాయి.

News August 15, 2024

SBI ఇండిపెండెన్స్ డే షాక్.. వడ్డీరేట్ల పెంపు

image

కస్టమర్లకు SBI షాకిచ్చింది. రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయంది. వరుసగా మూడో నెల బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. తాజా సర్దుబాటుతో MCLR రేట్లు పెరుగుతాయి. దీంతో వేర్వేరు కాల వ్యవధుల్లో తీసుకొనే రుణాల ఖర్చు, వడ్డీ భారం అధికమవుతాయి. యూకో, కెనరా, బరోడా సహా పబ్లిక్ బ్యాంకులు కొన్ని రోజుల ముందే MCLR రేట్లను పెంచడం గమనార్హం.

News August 15, 2024

‘అన్న క్యాంటీన్’ మెనూ ఇదే..

image

AP: ఆకలితో అలమటించే పేదలకు 15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందించే బృహత్తరమైన కార్యక్రమం ‘అన్న క్యాంటీన్’ పథకమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌ లభించనుంది. ఆదివారం క్యాంటీన్‌కు సెలవు. ఏ రోజు ఏ ఆహారం అనే వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.