India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో 16 మంది <<13850500>>IPSలకు<<>> రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడాన్ని TGకి చెందిన మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్ తప్పుపట్టారు. ‘గత నెల ఇద్దరు డీజీపీ ర్యాంకు ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ 16 మంది IPSలను DGP ఆఫీసులో రోజూ వచ్చి సైన్ చేయాలంటున్నారు. ఆఫీసర్లను ఖాళీగా ఉంచే బదులు పోస్టింగ్ ఇస్తే ప్రజలకోసం పని చేస్తారు. అసలు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది?’ అని <
ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన <<13857131>>రాహుల్<<>> గాంధీని కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు మొదటి వరుసలో కాకుండా వెనుక వరుసలో సీటును కేటాయించారని మండిపడుతున్నారు. అయితే, ఈసారి ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో కూర్చునే అవకాశం ఇచ్చామని, అందుకే రాహుల్ వెనుక వరుసలో కూర్చున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది.
బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ICC ప్రతిపాదనను తిరస్కరించానని BCCI కార్యదర్శి జైషా తెలిపారు. ‘భారత్‌లో అక్టోబర్లో వర్షాలు కురుస్తాయి. పైగా వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే వరుసగా 2 మెగా టోర్నీలు నిర్వహించలేమని సంకేతాలు పంపించా’ అని ఆయన అన్నారు. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో క్రికెటర్ల భద్రతపై ICC ఆందోళన చెందుతోంది.
SBI, PNBలో అన్ని ఖాతాలను మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని, ఇకపై లావాదేవీలు చేపట్టొదని ప్రభుత్వ శాఖలు, సంస్థలను ఆదేశించింది. KIADB చేసిన రూ.12 కోట్లు, KSPCBకి చెందిన రూ.10 కోట్ల డిపాజిట్ల అవినీతిలో తమ ఉద్యోగుల పాత్ర ఉందంటూ బ్యాంకులు డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేదు. బ్యాంకు అధికారులతో చర్చలూ విఫలమవ్వడంతో విషయం న్యాయ పరిధిలోకి వెళ్లింది.
పంద్రాగస్టు రోజున ఒడిశా ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు ఒక రోజు నెలసరి సెలవు ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతీ పరిదా ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పీరియడ్స్‌లో తొలి రోజు లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
TG: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి తీర్పు ఎప్పుడైనా రావొచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందనేది ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రుణమాఫీ కాకపోవడంతోనే రాహుల్ గాంధీ రాలేదని విమర్శించారు.
TG: కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు. కాకినాడలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ వేడుకకు కూతురు ఆద్యతో కలిసి వచ్చారు. ఈక్రమంలో స్టేజీపై కూతురుతో సెల్ఫీ తీసుకున్నారు. తండ్రి మొబైల్‌లో సెల్ఫీ తీస్తుంటే కూతురు మురిసిపోతూ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్య అంటే పవన్‌కు ఎంతో ఇష్టమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇష్టమైనవారి పేర్లు పచ్చబొట్టు వేయించుకోవడం కామనే. కానీ యూపీకి చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి 631మంది అమరవీరుల ఫొటోలు, పేర్లను పచ్చబొట్టు వేయించుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ సహా భారత జవాన్లు, స్మారక చిహ్నాల ఫొటోలు వీటిలో ఉన్నాయి. గత ఏడాది లద్దాక్ వెళ్లినప్పుడు ఓ జవాను తమను రక్షించారని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమ్ తెలిపారు.
AP: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో CM చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈమధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి’ అని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.