News November 14, 2024

రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో: మంత్రి నారాయణ

image

AP: విశాఖలో 76.90KM మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. తొలి దశలో 3 కారిడార్లలో 46KMల మేర నిర్మించడానికి రూ.11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. దీనికి 100 శాతం నిధులూ కేంద్రమే భరించేలా ప్రతిపాదనలు పంపామని, అక్కడి నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

News November 14, 2024

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: జీవోలు, ఆర్డినెన్సులను తెలుగులో వెలువరించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల అవి సామాన్యులకు అర్థం కావడం లేదని శేరిలింగంపల్లికి చెందిన జి.ఉమామహేశ్వర్‌రావు పిటిషన్ వేశారు. తెలుగులో ఇవ్వకపోవడం అధికార భాషల చట్టం 1956తో పాటు పలు జీవోలకు విరుద్ధమని ఆయన తరఫు లాయర్ అన్నారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించే విషయంలో కోర్టు నోటీసులచ్చింది.

News November 14, 2024

డయేరియా మరణాలు ఎన్ని?: మండలిలో వాడీవేడి చర్చ

image

AP: డయేరియా మరణాలపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. విజయనగరం(D) గుర్ల, వివిధ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోయారో చెప్పాలని YCP MLCలు ప్రశ్నించారు. గుర్లలో ఒక్కరే మరణించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. Dy.cm పవన్ గుర్లలో 10 మంది చనిపోయారని ₹2 లక్షల పరిహారం ప్రకటించారని, జగన్ కూడా అదేమేర సాయం చేశారని సభ్యులు గుర్తుచేశారు. మంత్రి నేరుగా ఆన్సరివ్వకుండా YCP పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

News November 14, 2024

సూర్య ‘కంగువా’ పబ్లిక్ టాక్

image

సూర్య మూవీ ‘కంగువా’కు మిక్సుడ్ టాక్ వస్తోంది. పీరియాడిక్ ఇంట్రడక్షన్ సీక్వెన్సులు బాగున్నాయంటున్నారు. అయితే ఒకానొక సమయం తర్వాత హీరో-విలన్ల మధ్య బిల్డప్ చిరాకు తెప్పిస్తుందట. సూర్య ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌, సెకండాఫ్ డిసప్పాయింట్ చేసిందని కొందరంటున్నారు.

News November 14, 2024

NOV 20న ప్రసార భారతి ఓటీటీ ప్రారంభం

image

ఈ నెల 20న ప్రసార భారతి OTT ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి సంజయ్‌జాజు వెల్లడించారు. లైవ్ ఛానల్స్‌తో పాటు పలు రకాల మీడియా మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో పాటు 236 చిన్నపట్టణాల్లో ప్రైవేటు FM రేడియోలు వస్తాయని, అందుకోసం వచ్చే నెలలో వేలం నిర్వహిస్తామని వివరించారు. HYDలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

News November 14, 2024

ఇవాళ్టి నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్

image

AP: లా కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో విడత <>కౌన్సెలింగ్<<>> నేటి నుంచి ఈనెల17 వరకు కొనసాగనుంది. 15వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 20 నుంచి 23 వరకు ఆప్షన్ల నమోదు, 24న మార్పులకు అవకాశం ఉంటుందని కన్వీనర్ సత్యనారాయణ చెప్పారు. 26న సీట్లు కేటాయిస్తామని, 29 లోగా అభ్యర్థులు కాలేజీల్లో చేరాలని తెలిపారు. కాగా ఈ ఏడాది ఏపీ లాసెట్‌ పరీక్షలో 17,117 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

News November 14, 2024

CRICKET: వింత కారణాలు.. నిలిపివేతలు!

image

క్రికెట్ మ్యాచ్‌లు ప్రధానంగా వర్షం, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం లేదా నిలిచిపోతుంటాయి. సౌతాఫ్రికాలో ఇండియా తాజాగా ఆడిన టీ20 పురుగుల వల్ల కాసేపు నిలిచిపోయింది. SAలోనే 2017లో తేనెటీగల దాడి వల్ల శ్రీలంకతో మ్యాచ్, 2017లో హలాల్ ఫుడ్ అందుబాటులో లేదని బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నిలిచిపోయాయి. వీటన్నింటికంటే వింతగా పాకిస్థాన్‌లో 1996లో PCB బంతులు సప్లై చేయకపోవడంతో NZతో టెస్టు 20ని.లు ఆలస్యమైంది.

News November 14, 2024

ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే

image

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News November 14, 2024

వర్మాజీ & శర్మాజీ

image

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్లు తిలక్‌వర్మ, అభిషేక్‌శర్మ అదరగొట్టారు. తిలక్ 107(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ 50(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో సూర్య(1), హార్దిక్(18) వంటి సీనియర్లు పెద్దగా రాణించకపోయినా <<14604651>>భారత్<<>> మంచి స్కోర్(219/6) చేసింది. దీంతో ఈ ఇద్దరు యువ బ్యాటర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

News November 14, 2024

‘లాపతా లేడీస్’ పేరు మారింది.. ఎందుకంటే?

image

బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2023లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. భారత్ నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దేశవిదేశాల్లో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యేలా టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’(Lost Ladies)గా మార్చేశారు. కాగా ఆస్కార్ వేడుక 2025 మార్చి 3న జరగనుంది.