India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్వెల్ సినిమాల్లో గ్రూట్ పాత్ర ఎంతో మెప్పించిన విషయం తెలిసిందే. వీటిల్లో గ్రూట్ పలుమార్లు ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్తుంటుంది. అయితే, దీనికి హాలీవుడ్ స్టార్ నటుడు విన్ డీజిల్ వాయిస్ అందించారు. కేవలం ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్పినందుకు ఆయనకు $54 మిలియన్లు (రూ.450 కోట్లు) ఇచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. కాగా, ఈ వార్తలను ఫిల్మ్ మేకర్ జేమ్స్ గన్ ఖండించారు.

AP: బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తనతో భేటీ కావడంపై
సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రాముఖ్యతపై ఆమెతో చర్చించినట్లు వెల్లడించారు. భారత్-యూకే భాగస్వామ్యం బలోపేతం దిశగా సమాలోచనలు చేశామని, కీలక రంగాల్లో మెరుగైన సహకారం దిశగా మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను తీసుకున్నారంటూ గతంలో వార్తలు రాగా తాజాగా హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ పేరు వినిపిస్తోంది. ది మార్షియన్, అల్లాదీన్, ఛార్లీస్ ఏంజెల్స్ వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు.

సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, సిమెలనే 2 వికెట్లు తీయగా, జాన్‌సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే SA 20 ఓవర్లలో 220 రన్స్ చేయాలి.

TG: గ్రూప్-4 ఫలితాలను వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయంలోగా ఫలితాలను కమిషన్ ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగే ప్రజా విజయోత్సవాల్లో గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను పెంచినట్లు TGSRTC ప్రకటించింది. HYDతో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని పేర్కొంది. స్పెషల్ బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో ఒక్క ఇయర్‌లో 5సార్లు డకౌట్ అయిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా శాంసన్ నిలిచారు. అయితే, T20Iలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ కూడా ఈయనే. సంజూ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో తొలి రెండింటిలో సెంచరీలు బాదగా.. చివరి రెండింట్లో డకౌటై పెవిలియన్ చేరారు. తిరిగి ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

TG: పెద్దపల్లి జిల్లాలో రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాఘవపురం-రామగుండం మధ్య అధికారులు గూడ్స్ రైలును నడిపించారు. నిన్న రాఘవపురం వద్ద గూడ్స్ <<14596360>>రైలు పట్టాలు తప్పడంతో<<>> ఢిల్లీ, చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది.

TG: KTRను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? అనే చర్చ రాజకీయ, BRS పార్టీ వర్గాల్లో నెలకొంది. ORR టెండర్లు, ఫార్ములా వన్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో KTR ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. ఇటీవల ఫార్ములా వన్ విషయంలో KTRపై కేసు పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరగా, తాజాగా కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి రిమాండ్‌లో KTR పేరు ఉండటంతో కావాలనే టార్గెట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
Sorry, no posts matched your criteria.