India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కొలనూరులో ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ చేస్తూ రావుల విజయ్ కుమార్(33) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది.
టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి బయటకు రాలేక ఆమె చనిపోయారు. గేర్ షిఫ్టింగ్ డిజైన్‌లో లోపాలే ఈ ఘటనకు కారణమని పలువురు టెస్లా యూజర్లు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఈ డిజైన్‌పై ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.
WPL-2024 పర్పుల్ క్యాప్ విజేత RCB, స్టార్ బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు సంబంధించిన ఓల్డ్ ఫొటో వైరలవుతోంది. 2017లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో ఆమె సెల్ఫీ దిగారు. ఆ ఫొటోతో పాటు తాజాగా ఆమె ట్రోఫీతో దిగిన ఫొటోను ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. ‘సక్సెస్ అంటే ఇదే.. RCB ఫ్యాన్ నుంచి 7 ఏళ్లలో గ్రౌండ్‌లో ట్రోఫీని ముద్దాడే స్థాయికి చేరుకున్నారు’ అని కొనియాడుతున్నారు. ఆమె 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీశారు.
నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుండగా CSKకు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శరీరమంతా తిమ్మిర్లు రావడంతో మైదానంలో నిలబడలేకపోయారు. దీంతో వెంటనే వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. CSK మరో పేసర్ పతిరణ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. తొలి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది.
కారు ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలు అయినట్లు వస్తోన్న వార్తలను సింగర్ మంగ్లీ ఖండించారు. తనకు ప్రమాదం జరిగిందని తెలిసి అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారని, తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ‘ఇది అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. ఈ యాక్సిడెంట్ రెండ్రోజుల క్రితం జరిగింది. రూమర్స్‌ను నమ్మకండి. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమా విడుదల తేదీలో మార్పు రానున్నట్లు సమాచారం. ఒకవేళ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఆ తేదీని రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ భర్తీ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘కల్కి’ షూటింగ్, VFX పనులు పూర్తికాకపోవడంతో మే 9 నుంచి ఆగస్టు 15కు తేదీ మారనుందట.
TS: సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు సాయంత్రం ఆయన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.
AP: గత నెలలో నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు ఈ నెల 14నే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్‌ను విడతలవారీగా నిర్వహించినందున మార్కులను నార్మలైజేషన్ చేయాల్సి ఉండటంతో ఆలస్యం అయినట్లు సమాచారం. టెట్‌లో అర్హత సాధిస్తేనే DSCకి అర్హులవుతారు. అలాగే టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈనెల 22వ తేదీన IPL2024 మొదలుకానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ మొదలవగా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ప్రారంభోత్సవ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు RR ప్లేయర్ అశ్విన్ ట్వీట్ చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్స్ దొరకలేదని, CSK సాయం చేయాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌తో పాటు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.