India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిపబ్లికన్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్‌ను ఇరాన్ హ్యాక్ చేసిందన్న ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో FBI విచారణ ప్రారంభించింది. మరోవైపు US ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ల ప్రచార బృందంలోని సలహాదారులే లక్ష్యంగా జరిగిన హ్యాకింగ్‌పై కూడా జూన్ నుంచే విచారణ జరుపుతోంది. అయితే ట్రంప్ క్యాంపెయిన్‌ను హ్యాక్ చేసినట్లుగా తమపై వస్తున్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం కొట్టివేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి, పూజలకు ఎంత ఖర్చవుతుందో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసం ఈ ఇన్ఫర్మేషన్. మ్యారేజ్ చేసుకునేందుకు ఫీజు లేదు. ఉపనయనం కోసం రూ.300, సత్యనారాయణ వ్రతానికి రూ.300, ఇతర పూజలకు రూ.200 చెల్లించాలి. సంగంలో చెవులు కుట్టించేందుకు రూ.50, కాటేజీలో రూ.100, పెళ్లి కోసం మేలం ఉచితమే, పూజలకోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం 08772263433, 18004254141కి కాల్ చేయండి.
క్రికెట్ ప్రేమికుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న. పైన కనిపిస్తున్న బ్యాటర్లందరూ విధ్వంసానికి మారుపేరు. రోహిత్, మ్యాక్స్‌వెల్, క్లాసెన్, నికోలస్ పూరన్, సూర్యకుమార్, బట్లర్, సికందర్ రజా, సాల్ట్, హెడ్.. వీళ్లు సెట్ అయ్యారంటే ప్రత్యర్థులు ఆశలు వదులుకోవాల్సిందే. మరి పై ప్లేయర్లలో అత్యంత విధ్వంసకర బ్యాటర్ ఎవరో కామెంట్ చేయండి.
వీర్యదాత, అండం ఇచ్చిన మహిళకు పుట్టిన బిడ్డలపై ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీరికి పిల్లలపై బయోలాజికల్ రైట్స్ ఉండవని స్పష్టం చేసింది. ఓ కేసులో మరదలు ఇచ్చిన అండంతో జన్మించిన కవలలపై తన భార్యకు ఎలాంటి హక్కు లేదని భర్త వాదిస్తుండడంపై బాధిత వివాహిత కోర్టును ఆశ్రయించింది. భర్త వాదనను తోసిపుచ్చిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
భారత జట్టు మాజీ కెప్టెన్ MS ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రెండీ లుక్‌లో ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ట్రిమ్ షేవ్, న్యూ హెయిర్ స్టైల్‌తో ఉన్న మిస్టర్ కూల్ లుక్‌ను ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ క్లిక్‌మనిపించారు. ఈ లుక్‌లో MSD సినిమా హీరోలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ టైంలోనూ వింటేజ్ లుక్‌లో ఆయన దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
TG: ప్రభుత్వ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయని ACB తనిఖీల్లో వెల్లడైంది. ఈరోజు 10 హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీ, శుభ్రతపై అధికారులు తనిఖీలు చేశారు. శుభ్రత లేదని, మంచినీరూ సరిగా ఇవ్వట్లేదని గుర్తించారు. రోజూ పాలు, గుడ్డు అందట్లేదని, రికార్డులు మెయింటైన్ చేయట్లేదని తేల్చారు. వార్డెన్లు వారానికో సారి లేదా నెలకోసారి మాత్రమే వస్తున్నారని తెలిపారు. సరుకుల కొనుగోళ్లలో నిధులు పక్కదారి పట్టాయన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, BRS MLC కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో ఈ కస్టడీ పొడిగించారు. ఇద్దరినీ తిహార్ జైలు నుంచి వర్చువల్‌గా జడ్జి ముందు అధికారులు హాజరుపరిచారు. అటు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
TG: రూ.లక్షన్నర వరకు 2 విడతల్లో రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా పలువురికి రుణాలు జమ కాలేదు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆధార్, పాస్‌బుక్‌లో పేర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి మాఫీ కాలేదు.
AP: విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు CM చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ID కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
AP: రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, ప.గో, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.