News November 12, 2024

మా అబ్బాయి రికార్డుల కోసం చూడడు: శాంసన్ తండ్రి

image

తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.

News November 12, 2024

19న OTTలోకి థ్రిల్లర్ మూవీ

image

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది.

News November 12, 2024

కలెక్టర్‌పై దాడి చేయడమేంటి?

image

జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 12, 2024

శత్రుదాడి జరిగితే పరస్పర రక్షణకు రష్యా, నార్త్ కొరియా డీల్

image

శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్‌కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.

News November 12, 2024

ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా మనిషి ట్రాకింగ్!

image

మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్‌ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్‌ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.

News November 12, 2024

BJPని కుక్కలా మార్చే టైమొచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే సరికొత్త వివాదానికి తెరలేపారు. OBC కమ్యూనిటీతో BJP తీరును విమర్శిస్తూ ఆ పార్టీ నేతలను కుక్కలుగా మార్చాలన్నారు. ‘అకోలా జిల్లా ఓబీసీలను నేనొకటే అడుగుతున్నా. మిమ్మల్ని కుక్కలని పిలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా? ఇప్పుడు బీజేపీని కుక్కలా మార్చే టైమొచ్చింది. వాళ్లకు అహంకారం తలకెక్కింది’ అని అకోలా సభలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అధికార మహాయుతి కూటమి భగ్గుమంది.

News November 12, 2024

ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు వీరికే..

image

ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(OCT)గా పాక్ స్పిన్నర్ నోమన్ అలీ, ఉమెన్స్ విభాగంలో అమేలియా కెర్(కివీస్) ఎంపికయ్యారు. ENGతో టెస్టు సిరీస్‌లో నోమన్ 13.85 యావరేజ్‌తో 20 వికెట్లు పడగొట్టారు. దీంతో రబడ, శాంట్నర్‌ను అధిగమించి అవార్డు పొందారు. అమేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్‌తో సహా అక్టోబర్‌లో 19 వికెట్లు కూల్చి, 160 రన్స్‌ చేశారు. డియాండ్రా డాటిన్, లారా వోల్వార్డ్‌‌తో పోటీ పడి అవార్డు గెలుచుకున్నారు.

News November 12, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ MLAలకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా వీరిపై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 12, 2024

వికారాబాద్ బయల్దేరిన BRS నేతలు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అరెస్టైన రైతులను పరామర్శించేందుకు BRS నేతలు కొడంగల్ నియోజకవర్గానికి బయల్దేరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు అరెస్టైన వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

News November 12, 2024

విరాట్ బ్యాటింగ్ చూస్తూ నేర్చుకున్నా: నితీశ్

image

చిన్నప్పటి నుంచి కోహ్లీ ఆటతీరు చూస్తూ పెరిగానని యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రికెట్లో తనకు కోహ్లీ ఆరాధ్య దైవమని చెప్పారు. విరాట్ స్టైల్ చూసి బ్యాటింగ్ నేర్చుకున్నానని.. అతడి గేమ్ ప్లే, ఆటిట్యూడ్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఇండియన్ క్రికెట్ స్టైల్‌ను కింగ్ మార్చేశారని, అతడిలో ప్రతి క్వాలిటీని అభిమానిస్తానని నితీశ్ వివరించారు.