News March 17, 2024

చైనాలో వింత.. తోకతో జన్మించిన చిన్నారి

image

చైనాలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు 10 సెంటీమీటర్ల పొడవు తోకతో పాప జన్మించింది. వీపు వైపు ఇది బయటకు వచ్చింది. పిండం సరిగ్గా ఎదగకపోవడం, జన్యుపరమైన లోపాలు, వెన్నెముక పెరగడంలో సమస్యల కారణంగా ఇలాంటి అరుదైన పిల్లలు పుడతారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని caudal appendageగా వ్యవహరిస్తారని వివరించారు. ఈ తోక నాడులతో అనుసంధానమైందున తొలగించడానికి డాక్టర్లు నిరాకరించారు.

News March 16, 2024

RCBకి సూపర్ న్యూస్

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇటీవల కుమారుడు అకాయ్ జన్మించడంతో దాదాపు రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరమైన అతడు రెండు మూడు రోజుల్లో ఆర్సీబీ జట్టులో చేరనున్నారు. ఈ నెల 22న CSKతో జరగనున్న మ్యాచ్‌కు ముందు బెంగళూరులో జరిగే RCB ప్రీ-టోర్నమెంట్ క్యాంప్‌లో కోహ్లీ పాల్గొంటారని Espncricinfo పేర్కొంది. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ అతడికి కీలకంగా మారనుంది.

News March 16, 2024

రెండో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదే..

image

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 4 నెలలు(OCT 25, 1951 నుంచి FEB 21, 1952 వరకు) సాగింది. ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఈ ఏడాది జరగనున్నాయి. APR 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజులు ప్రక్రియ కొనసాగనుంది. 1962 నుంచి 1989 మధ్య 4-10 రోజుల్లో ఎన్నికలు ముగిశాయి. అత్యల్పంగా 1980లో జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల్లోనే పూర్తయ్యాయి. 2004లో 21 రోజులు, 2009లో 30, 2014లో 36, 2019లో 39 రోజులు జరిగాయి.

News March 16, 2024

రోహిత్‌ కెప్టెన్సీ తొలగింపు మంచిదే: ఫించ్

image

ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలగింపు ఆ జట్టుకు ఒక రకంగా మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీ భారం భుజాలపై లేకపోవడంతో రోహిత్ మరింత స్వేచ్ఛగా, ప్రమాదకరంగా ఆడతారని పేర్కొన్నారు. ‘ఎక్కడికి వెళ్లినా జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు రోహిత్‌కు లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి భారీగా పరుగులు చేయడం ఒకటే ఇప్పుడు ఆయన చేయాల్సింది’ అని స్పష్టం చేశారు.

News March 16, 2024

లక్షద్వీప్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.15.33 తగ్గింపు

image

లక్షద్వీప్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కవరట్టి, మినికాయ్ ద్వీపంలో డీజిల్‌పై ₹5.20, పెట్రోల్‌పై ₹5.19, అండ్రోట్ అండ్ కల్పేనీలో డీజిల్‌పై ₹15.33, పెట్రోల్‌పై ₹15.38 తగ్గించినట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు ₹2 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే.

News March 16, 2024

చరిత్ర సృష్టించేదెవరో?

image

మహిళల ప్రీమియర్ లీగ్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం ఢిల్లీ వేదికగా ఫైనల్ పోరులో DC, RCB తలపడనున్నాయి. ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరగా.. ఆర్సీబీ తొలిసారి అడుగుపెట్టింది. బలాబలాల విషయంలో రెండు జట్లు సమతూకంతో ఉండటంతో తుది పోరు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. అటు పురుష, మహిళల లీగ్‌ల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవని DC, RCBకి తొలిసారి టైటిల్‌ను ముద్దాడే అవకాశం వచ్చింది.

News March 16, 2024

వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే: సీఈసీ

image

AP: ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందేనని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చిచెప్పారు. వారితో పాటు కాంట్రాక్టు సిబ్బంది కూడా ఎన్నికల విధులు నిర్వర్తించరాదని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ కూడా అదే విషయాన్ని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని మాత్రం ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంకు వేసేందుకు మాత్రమే వారిని వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News March 16, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు BIG ALERT

image

TS: గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్లు TSPSC ప్రకటించింది. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు మార్చి 23వ తేదీ ఉ.10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మార్చుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది.

News March 16, 2024

VIRAL: మనిషి చేతిని ఎత్తుకెళ్లిన వీధికుక్క

image

సగానికి తెగిపోయిన మనిషి చేతిని వీధికుక్క నోట కరుచుకుని తీసుకెళ్తున్న వీడియో వైరలవుతోంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ఆస్పత్రి ప్రాంగణంలో మనిషి చేతిని ఎత్తుకెళుతున్న వీధి కుక్కను చూసి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న వారు అరవడంతో చేతిని వదిలేసి కుక్క పారిపోయింది. అయితే, ఇది మార్చురీలో నుంచి తీసుకొచ్చిందా? లేక ఇంకెక్కడి నుంచైనా తెచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.

News March 16, 2024

వన్ ఎలక్షన్- వన్ ఫేజ్ ప్రయత్నించగలమా?: కమల్ హాసన్

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ను అమలు చేయడానికి ముందు మనం వన్ ఎలక్షన్- వన్ ఫేజ్ ప్రయత్నించగలమా?’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో నిర్వహించనున్నట్లు EC వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ ఇటీవల ఓ నివేదికను సమర్పించింది.