India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.
గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <
సీఏఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం అమలు ఆలస్యమైందన్నారు. ‘విభజనప్పుడు పొరుగు దేశాల్లో స్థిరపడిన ప్రజలకు సమస్యలు ఎదురైతే మళ్లీ తిరిగి తీసుకొస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారు. 75ఏళ్లలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. 30-40ఏళ్ల క్రితమే కొందరు భారత్ వచ్చినా ఇంకా శరణార్థులుగానే ఉన్నారు. ఇందుకు సిగ్గుగా లేదా?’ అని ప్రశ్నించారు.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు న్యాయవాదులపై హామీల వర్షం కురిపించారు. పార్టీ లీగల్ సెల్ వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర పోరాటం తరహాలో ఏపీకి ఉన్మాది పాలన నుంచి విముక్తి కల్పించేందుకు న్యాయవాదులు పోరాడాలి. అధికారంలోకి వచ్చాక న్యాయమిత్ర పేరుతో లాయర్లకు ప్రతి నెలా రూ.7వేల స్టైఫండ్ ఇస్తాం. అడ్వొకేట్ల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇస్తాం’ అని వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్‌పై సీఎం జగన్ స్పందించారు. ‘13 మే 2024 సిద్ధం’ అని ట్వీట్ చేశారు. దీనికి #VoteForFan, #Siddham అంటూ హాష్‌ట్యాగ్స్ ఇచ్చారు. దీంతో ‘సిద్ధం బాస్’ అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి టీడీపీలో చేరారు. అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, అద్దంకి నేతలు బాచిన గరటయ్య, కృష్ణచైతన్య కూడా సైకిల్ ఎక్కారు. చంద్రబాబు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లిక్కర్ సిండికేషన్‌ను కవిత తెర వెనక ఉండి నడిపారని ED ఆరోపించింది. ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా గల అరుణ్ పిళ్లై కవితకు డమ్మీ వ్యక్తి అని అధికారులు తెలిపారు. సాక్ష్యాలు బయటకు రాకుండా ఫోన్లు, పలు డాక్యుమెంట్లను MLC ధ్వంసం చేశారని వెల్లడించారు. డేటా రికవరీ కోసం ఆమె 10 ఫోన్లు ల్యాబ్‌కు పంపితే 4 మొబైళ్లలో డేటా రికవరీ కాలేదన్నారు. తమ విచారణలోనూ అసంబద్ధ సమాధానాలు ఇవ్వడంతోనే అరెస్టు చేశామని వివరించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రాణిస్తారని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ హెడ్ కోచ్ వెటోరీ ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్ కూడా. ఆయనతో కమిన్స్‌కు చక్కటి అనుబంధం ఉంది. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారీ కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈసారి SRH రాణిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని స్మిత్ వ్యాఖ్యానించారు.
AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్‌ను నియమించామని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ఒకవేళ ఉంటే.. కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. తనిఖీల్లో దొరికితే పోలీసులు డబ్బును సీజ్ చేస్తారు. బంగారం, వెండి వంటి ఆభరణాలు సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తే రోగి రిపోర్టులు, రసీదులను చూపించాలి.
Sorry, no posts matched your criteria.