India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు, వన్డే ఫార్మాట్లలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతారని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ ఫిట్‌నెస్‌ను చూస్తే మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతారని జోస్యం చెప్పారు. జట్టులో ఫిట్‌నెస్ పరంగా అతనే దృఢంగా ఉంటారన్నారు. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే హిట్ మ్యాన్, కింగ్ ముఖ్యమైన ఆటగాళ్లని భావిస్తున్నట్లు తెలిపారు.
TG: సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అంటూ TG కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టర్ పంచుకుంది. అందులో డిప్యూటీ CM భట్టి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్, జాతీయ స్థాయి నేతల ఫొటోలున్నాయి. అయితే అందులో CM రేవంత్ ఫొటో లేకపోవడంతో BRS సెటైర్లు వేసింది. ‘పాపం కొరియా నుంచి తిరిగి వచ్చే లోపు రేవంత్ ఫొటో మాయం. ఆయన పదవైనా ఉందా అది కూడా ఊడిందా? కాంగ్రెస్ ఆ మజాకా!’ అంటూ రీట్వీట్ చేసింది.
స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు బయటికి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం విపరీతమైన బాధను అనుభవిస్తుంటారు. ఈ డిప్రెషన్ ఉన్నవారిని సూసైడ్ ఆలోచనలు వేధిస్తుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇతర డిప్రెషన్‌లతో పోల్చితే దీన్ని గుర్తించడం కష్టం. ఒకవేళ మీరు స్మైలింగ్ డిప్రెషన్ ఎదుర్కొంటుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
కెరీర్ తొలినాళ్లలో మూవీ ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్నని హీరోయిన్ రష్మిక అన్నారు. ఒక సినిమాకు సెలక్టయ్యాక 2, 3 నెలల పాటు వర్క్ షాప్స్ జరిగాయని, కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం పుష్ప-2, సికిందర్, కుబేర వంటి చిత్రాలతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.
కోల్‌కతాలోని పార్సీ బగాన్ స్క్వేర్‌లో 1906 ఆగస్టు 7న ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులున్న తొలి భారతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భారత జెండాను 1921లో పింగళి వెంకయ్య రూపొందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘జన గణ మన’ను మొదట్లో ‘భారొతో భాగ్యో బిధాత’ అని పిలిచేవారు. ఆగస్టు 15న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, బహ్రెయిన్, లిచెన్‌స్టెయిన్, కాంగో దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాయి.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడెమీలో ఏర్పాటు చేసిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో రామ్ పాల్గొన్నారు. అక్కడున్న ఉన్నతాధికారులతో పాటు ట్రైనీ పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ వీడియోను ఈనెల 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
బ్యాడ్మింటన్ స్టార్ సింధు వచ్చే ఒలింపిక్స్(2028)లో ఆడటంపై మాజీ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని సింధుకు కోరికగా ఉంటే సరిపోదు. ఆమె వయసు పెరిగే కొద్ది శరీరం ఎలా సహకరిస్తుందనేది ముఖ్యం. ఒకవేళ సహకరిస్తే ఎంతకాలమైనా కొనసాగవచ్చు. పారిస్ ఒలింపిక్స్‌లో సింధు బాగానే ఆడినా ప్రత్యర్థి బింగ్జియావో ఆమె కన్నా మెరుగ్గా ఆడారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నకిలీ, స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.
AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటించింది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, VIT, SRM యూనివర్సిటీలు, AIIMS, కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ టీం పరిశీలించింది. అమరావతిపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలను వారికి వివరించిన బాబు.. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారిని కోరారు.
TG: రాష్ట్రంలో హ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని CMO తెలిపింది. ద.కొరియా పర్యటనలో CM రేవంత్ హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో చర్చలు జరిపారని పేర్కొంది. ఈ మెగా టెస్టింగ్ సెంటర్‌లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయం, అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉండనుంది. దీంతో పాటు అనుబంధ సంస్థలూ వస్తాయని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయంది.
Sorry, no posts matched your criteria.