India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మేడిగడ్డ పర్యటనలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని <<13833888>>కేటీఆర్‌పై<<>> నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన కుటుంబం వెల్లడించింది. డిప్రెషన్, ఆందోళన కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులాడిన గ్రాహం ఈ నెల 5న కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారని అందరూ అనుకున్నారు. హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబానికి భారంగా మారానని బాధపడుతూ ఉండేవారని థోర్ప్ భార్య తెలిపారు. ఆ బాధతోనే సూసైడ్ చేసుకున్నారని వివరించారు.
AP: రాష్ట్రంలో అన్ని రకాల NMC బ్రాండ్లకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80-90లోపే నిర్ధారించాలని యోచిస్తోంది. కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త పాలసీ ఈనెల చివర్లో లేదా వచ్చేనెల తొలి వారం నుంచి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా జైపూర్‌లో చిత్రీకరించిన ఫైట్ సీన్ షూటింగ్ పూర్తయినట్లు బాబీ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఆయన ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉంటారని, మోస్ట్ పవర్‌ఫుల్ సీన్స్‌లో బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. టైటిల్ టీజర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ముజిబ్‌నగర్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్మారక విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. భారతీయ సాంస్కృతిక కేంద్రం, హిందువుల ఇళ్లు, గుళ్లు, ఆస్తులనూ నాశనం చేశారని పేర్కొన్నారు. కొన్ని చోట్ల మైనారిటీలకు ముస్లిములు రక్షణ కల్పిస్తున్న వార్తలూ వచ్చాయన్నారు. ఆందోళనకారుల అజెండా స్పష్టమవుతోందని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ను చక్కదిద్దాలని యూనస్‌కు సూచించారు.
AP: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనాల రాకపోకలపై TTD ఆంక్షలు విధించింది. ఉ.6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని తెలిపింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పింది. ఈ 2 నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని BJP ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. ప్రధాని కాలేకపోతే దేశాన్ని నాశనం చేయడమే ఆయన అజెండా అని దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘దేశ భద్రత, ఆర్థిక స్థితిని అస్థిర పరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారు. ఆయనను ఎప్పటికీ నాయకుడిగా చేసుకోరు’ అని అన్నారు.
AP: వైసీపీ చీఫ్ జగన్ సెక్యూరిటీని తగ్గించలేదని, భద్రత తగ్గించారంటూ ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హోం మంత్రి అనిత అన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజమండ్రి జైలును పరిశీలించిన ఆమె.. గతంలో చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. బాబు ఉన్న స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లగానే తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.
భారత స్టాక్‌మార్కెట్లు కూలిపోవడమే కాంగ్రెస్ లక్ష్యమని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. మూడోసారి ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ దాని ‘టూల్ కిట్’ మిత్రపక్షాలు భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ద్వేషాన్ని పెంచిందని, కంట్రోల్ రాజ్‌ను తిరిగి తీసుకురావాలని చూస్తోందని దుయ్యబట్టారు.
AP: ఈ నెల 18న తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి 17 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సంపంగి ప్రాకారంలో 17వ తేదీ రాత్రి వరకు వైదిక కార్యక్రమాలు కొనసాగనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.