India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అమెరికాలో పర్యటించిన CM రేవంత్ బృందం మొత్తం ₹31,500 కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లు CMO వెల్లడించింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కాగ్నిజెంట్, అమెజాన్, చార్లెస్ స్క్వాబ్, ఆమ్జెన్, మోనార్క్ ట్రాక్టర్, జొయిటిస్, HCA హెల్త్ కేర్, వివింట్ ఫార్మా వంటివి ఉన్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభించనున్నాయి.
బంగ్లాదేశ్ హిందువులకు అమెరికా హిందూ సంఘాలు బాసటగా నిలిచాయి. హ్యూస్టన్‌లో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించాయి. అతివాద ముస్లిముల దాడుల నుంచి మైనారిటీలను రక్షించేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ‘హిందువులపై హింసాకాండను ఆపండి’, ‘అండగా నిలవండి, మద్దతుగా మాట్లాడండి’, ‘హిందూ లైవ్స్ మ్యాటర్’, ‘మేం పారిపోం, దాక్కోం, హిందువులపై హింసను ఆపండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
వినేశ్ ఫొగట్ ‘బరువు’ వివాదంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్షా పార్దీవాలాను బాధ్యుడిని చేయడాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తప్పుపట్టారు. ‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి క్రీడల్లో బరువు సరిచూసుకునే బాధ్యత కచ్చితంగా ఆటగాళ్లు, వారి కోచ్‌లదే. చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు, అతడి బృందానికి దీంతో సంబంధం ఉండదు. కొందరు పార్దీవాలాపై చేస్తున్న విమర్శలు ఏమాత్రం సరికాదు’ అని పేర్కొన్నారు.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు. ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతోపాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. <<13827490>>FORDA<<>> పిలుపు మేరకు వైద్య సిబ్బంది ఆందోళనలు చేయనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.
బిహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జెహనాబాద్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో ఇవాళ ఉదయం తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన విషయం తెలిసిందే.
TG: రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోంది. గత ఏడాది LICకి ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంతనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా ఉన్న రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే.
సచిన్ టెండూల్కర్ గురించి ఆయన అత్త అనాబెల్ మెహతా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకుని అతడిని చూడాలనుకున్నా. ఆరడుగులు ఉంటాడని, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. తీరా చూస్తే పొట్టిగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించాడు. అంజలి హీల్స్ వేసుకుంటే ఆమె ఎత్తు కూడా ఉండడు. నిశ్చితార్థం అయ్యాక దొంగచాటుగా మా ఇంటికి వచ్చేవాడు’ అని ఆమె ‘మై పాసేజ్ టు ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నారు.
TG: హైదరాబాద్‌లో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరంతో బాధపడుతూ చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీని వల్ల కొంతమందిలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నాయి. డెంగీతోపాటు గన్యా బాధితులూ పెరుగుతున్నారు. కాగా డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.
వరుస సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరోవైపు భాను భోగవరపు డైరెక్షన్‌లో 75వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి ‘కోహినూర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.