News August 12, 2024

నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల

image

AP: గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు. ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు మంత్రి అందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు ఉండగా ఎన్డీఏ సర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది.

News August 12, 2024

శ్రావణ సోమవారం శివయ్యను ఇలా పూజించాలి

image

శ్రావణమాసంలో శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వారు భూమిపై నివసించి భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఇవాళ నీలకంఠుడిని పూజించడం ద్వారా శత్రు భయాలు, పనుల్లో ఆటంకాలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతుందని చెబుతారు. చెరుకు రసంతో అభిషేకం చేసి ‘ఓం నమో నీలకంఠాయనమ:’ అనే మంత్రాన్ని జపించాలి.

News August 12, 2024

కవితకు బెయిల్ వస్తుందా?

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకూ బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

News August 12, 2024

టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

image

AP: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న SGTలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.

News August 12, 2024

సీమ రైతుల ఆశలు ‘తుంగభద్ర గేటు’లో కొట్టుకుపోయాయ్

image

AP: తుంగభద్ర డ్యామ్‌లో <<13826350>>గేటు<<>> కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా అన్ని గేట్లూ ఎత్తేశారు. దీంతో మొత్తంగా 61 టీఎంసీలు వృథా కానున్నాయి. దీనివల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది. తుంగభద్రకు వచ్చే 4 నెలల్లో కనిష్ఠంగా వరద వస్తుందని, మళ్లీ డ్యామ్ నిండటం కష్టమని నిపుణులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News August 12, 2024

మాయమైపోతున్న రైతన్న!

image

వ్యవసాయం చేసేందుకు యువత ఆసక్తి చూపడం లేదని DIU (డెవలప్‌మెంట్ ఆఫ్ యూనిట్) తెలిపింది. వ్యవసాయంలో తగిన ఆదాయం రావడం లేదని గ్రామీణ యువత భావిస్తున్నట్లు వెల్లడించింది. సాగు ఏమాత్రం ఉపయోగకరం కాదని 63.8 % పురుషులు, 62.7 % మహిళలు చెప్పినట్లు పేర్కొంది. ప్రస్తుతం సాగు చేస్తున్నవారిలో 60 శాతం మంది సాగును వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. యువత ఐటీ, ఇంజినీరింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది.

News August 12, 2024

OLYMPICS: మరోసారి అమెరికాకే అందలం

image

ఒలింపిక్స్‌లో అగ్రరాజ్యం అమెరికా మరోసారి టాప్ ర్యాంకుతో తన ప్రయాణం ముగించింది. పారిస్ విశ్వ క్రీడల్లో ఆఖరి మెడల్ ఆ దేశానిదే కావడంతో చైనాతో సమానంగా నిలిచింది. ఇరు దేశాలు చెరో 40 స్వర్ణ పతకాలు నెగ్గాయి. ఓవరాల్‌గా యూఎస్ 126 పతకాలు సాధించి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత చైనా (91), జపాన్ (45), ఆస్ట్రేలియా (53), ఫ్రాన్స్ (64), నెదర్లాండ్స్ (34) ఉన్నాయి. కాగా భారత్ 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది.

News August 12, 2024

డ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ ప్రయాణం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వేమో అనే డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి దాని విశేషాల గురించి ఆయన తెలుసుకున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అందులో ప్రయాణించారు.

News August 12, 2024

శోభిత ధూళిపాళ్ల.. అప్పట్లో అలా!

image

నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అనంతరం శోభిత ధూళిపాళ్ల గురించి సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఆమె గత సినిమాల గురించి, ‘మిస్ ఇండియా ఎర్త్’ పోటీల గురించి వెతుకుతున్నారు. ఈక్రమంలో ఆ పోటీలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఆమె పూర్తి భిన్నంగా కనిపిస్తుండటం గమనార్హం. 2013లో జరిగిన ఈ పోటీల్లో ఆమె టైటిల్ గెలవలేకపోయినా మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ దక్కించుకున్నారు.

News August 12, 2024

ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబే బెస్ట్ యాక్టర్: భట్టి

image

నటనలో ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబే బెస్ట్ యాక్టర్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. ఏపీలోని చంద్రగిరిలో జరిగిన ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో భట్టి మాట్లాడారు. ‘పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు మోహన్‌బాబు జీవితమే నిదర్శనం. విద్యను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో అందిస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా ఆయన గతాన్ని మర్చిపోరు’ అని ఆయన కొనియాడారు.