India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇప్పుడంటే ఇడ్లీలు, దోసెలు వచ్చేశాయి కానీ ఒకప్పుడు చద్దన్నమే తెలుగువారికి అమృతం. రాత్రి వండిన అన్నం మరుసటి ఉదయానికి చద్దన్నంగా మారుతుంది. అందులో మజ్జిగో గంజో వేసుకుని మిర్చి, ఉల్లి నంజుకుని తింటే ఆ రుచే వేరు. ‘చద్దన్నం డీహైడ్రేషన్, అలసట, బలహీనతలను దూరం చేస్తుంది. దానిలోని పోషకాలు బీపీని తగ్గిస్తాయి. ఎముకల్ని పటిష్ఠం చేస్తాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. ఇదే రోజున భారత రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 2008 ఆగస్టు 11న పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచారు. తద్వారా భారత్ తరఫున వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచిపోయారు. గతంలోనూ భారత్ స్వర్ణ పతకాలు గెలిచినా అవి జట్టుగా ఆడే హాకీ ద్వారా లభించాయి.
స్టాక్ మార్కెట్లు, అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని ఇండీట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ సుదీప్ బంధోపాధ్యాయ అన్నారు. మొదట్లో కొంత రియాక్షన్ కనిపించినా తర్వాత కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేశారు. ‘స్టాక్ మార్కెట్లో గందరగోళం సృష్టించేందుకు ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అవి. అదానీ స్టాక్స్‌లో సెల్లింగ్ ఉండకపోవచ్చు’ అని ప్రాఫిట్ మార్ట్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ అభిప్రాయపడ్డారు.
TG: మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేంద్రనగర్‌కు చెందిన రైల్వే లైన్‌మెన్ కృష్ణ తన ఇద్దరు కూతుళ్లను ట్రాక్‌పై కూర్చోబెట్టి పనిచేస్తున్నాడు. దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అథ్లెట్ల ఆరోగ్యం కోసమే బరువు నిబంధనలు తీసుకొచ్చామని ప్రపంచ రెజ్లింగ్ చీఫ్ నెనాడ్ లలోవిక్ అన్నారు. వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అయినందుకు ఆవేదన చెందారు. ‘దేశ పరిమాణంతో సంబంధం లేదు. అందరు అథ్లెట్లూ సమానమే. వినేశ్ బరువును అందరి ముందే కొలిచారు. మరి నిబంధనలు పాటించకుండా మేమేం చేయగలం? చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయేమో గానీ బరువు నిబంధనైతే మార్చలేం. మా వైద్య కమిషన్ ఇందుకు వ్యతిరేకంగా ఉంది’ అని ఆయన అన్నారు.
TG: రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తు గడువు ఆగస్టు 12వ తేదీ సా.5 గంటలతో ముగియనుంది. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో 12 వరకు పొడిగించారు.
ఐశ్వర్యతో విడాకుల <<13619588>>రూమర్లపై<<>> హీరో అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారు. మీకు స్టోరీలు కావాలి కదా? మేం సెలబ్రిటీలు కాబట్టి ఇలాంటివి స్వీకరించాలి. కానీ నేనింకా వివాహ బంధంలోనే ఉన్నా’ అంటూ చేతి వేలికున్న రింగును చూపించారు. కాగా ఐష్, అభిషేక్ మధ్య వివాదాలు రావడంతో వారిద్దరూ విడిపోతున్నారని బాలీవుడ్‌లో కొద్దికాలంగా వార్తలొస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ మరికాసేపట్లో ముగియనుండగా విశ్వక్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్‌లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. మిగతా 5 మెడల్స్ కాంస్యాలే. ఇందులో మనూ భాకర్ 2, సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, హాకీ టీమ్, అమన్ తలో మెడల్ గెలిచారు.
AP: విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికల్లో TDP తరఫున ఎవరు <<13827415>>పోటీ చేస్తారనే<<>> దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థిగా మాజీ MLA గండి బాబ్జీ, పీలా గోవింద్, PVG కుమార్, బత్తుల తాతయ్య, బైరా దిలీప్‌ల పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థిని రేపు సీఎం చంద్రబాబు ఫైనల్ చేస్తారని TDP శ్రేణులు భావిస్తున్నాయి. అటు స్థానికంగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపై చంద్రబాబు నియమించిన కమిటీ రేపు నివేదిక సమర్పించే ఛాన్సుంది.
జాతీయ పక్షి నెమలిని వేటాడటం, చంపడం నేరం. కానీ తెలంగాణకు చెందిన ఓ యూట్యూబర్ దాన్ని చంపి ఏకంగా కూర ఎలా వండాలో వీడియో చేశాడు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అడవిలోకి వెళ్లి నెమలిని చంపాడు. దాన్ని కూర వండే విధానాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.