News August 10, 2024

ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికుల వీరమరణం

image

J&K: అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

News August 10, 2024

మున్ముందు ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్‌తోనూ UPI చెల్లింపులు?

image

యూపీఐ పేమెంట్స్‌కు ప్రస్తుతం పిన్ వాడుతున్నాం. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రత్యామ్నాయ భద్రత విధానాలనూ అనుసరించాలని RBI ఇటీవల ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ ఫీచర్ల సదుపాయాన్ని కూడా తీసుకొచ్చేందుకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ(NPCI) యోచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News August 10, 2024

స్ట్రాటజీ ముందు చెప్పరు: చంద్రబాబు

image

ప్రత్యేక పరిస్థితుల్లో TTDP అధ్యక్షుడిని నియమించలేదని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, AP CM చంద్రబాబు తెలిపారు. HYD NTR భవన్‌లో మాట్లాడిన ఆయన ‘2 ఎలక్షన్స్‌లో మేం పోటీ చేయలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. అప్పటి పరిస్థితుల వల్ల ఏపీపైనే దృష్టి పెట్టాలనుకున్నాం. పెట్టాం. ఇక్కడ కూడా సరైన సమయంలో సరైన స్ట్రాటజీ ఉంటుంది. ఎక్కడైనా స్ట్రాటజీ ముందు చెప్పరు’ అని వ్యాఖ్యానించారు.

News August 10, 2024

వాలంటీర్లను మోసం చేశారు: YS జగన్

image

AP: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని YS జగన్ విమర్శించారు. ‘ఖజానా ఖాళీ అయిపోయిందంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం, వసతి దీవెన, సున్నావడ్డీ, ప్రతి ఇంటికి ఉద్యోగం, రూ.3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. వాలంటీర్లను మోసం చేశారు. ఇంగ్లిష్ మీడియం గాడి తప్పింది. రెడ్ బుక్ రాజ్యమేలుతోంది. ఇకనైనా అబద్ధాలు మాని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయండి’ అని ట్వీట్ చేశారు.

News August 10, 2024

భారతీయుడు-2పై దారుణంగా ట్రోలింగ్!

image

శంకర్ తెరకెక్కించిన భారతీయుడు-2 సినిమా థియేటర్లలో ఉన్నప్పుడే దారుణమైన రెస్పాన్స్‌ను చవిచూసింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ట్రోలింగ్ మరింత ఘోరంగా ఉంది. సిల్వర్ స్క్రీన్‌పై చూడనివారంతా ఓటీటీలో చూసి షాకవుతున్నారు. భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, రోబో వంటి సినిమాలను తెరకెక్కించిన ఆ శంకరేనా ఈ సినిమాను తీసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగువారి కంటే తమిళ ఆడియన్సే ఎక్కువ ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

News August 10, 2024

బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు? చంద్రబాబు సమాధానమిదే..

image

HYD NTR భవన్‌కు వెళ్లిన AP CM చంద్రబాబుకు విలేకరుల నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘తెలంగాణ టీడీపీ బాధ్యతలు నారా లోకేశ్‌కి అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా?’ అని రిపోర్టర్లు అడిగారు. దీనికి ‘మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్‌గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను’ అని స్పష్టం చేశారు.

News August 10, 2024

తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆలోచిస్తున్నా: చంద్రబాబు

image

తెలంగాణలో TDPని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని AP CM చంద్రబాబు హైదరాబాద్‌లోని NTR భవన్‌లో అన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. ‘టీడీపీ హైదరాబాద్‌లోనే పుట్టింది. ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశాం. ప్రజలకు, కార్యకర్తలకు పార్టీని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఆలోచిస్తున్నా. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని క్లారిటీ ఇస్తా’ అని చంద్రబాబు వెల్లడించారు.

News August 10, 2024

బెల్లం ర‌మ్ వ‌చ్చేస్తోంది గురూ..

image

బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి దేశీయ ఒరిజిన‌ల్‌ రమ్ త్వరలో కర్ణాటక మార్కెట్‌లోకి విడుద‌ల‌కానుంది. హులి (టైగర్) పేరుతో ఆగ‌స్టు 15న‌ రానున్న ఈ మైసూర్ స్పెష‌ల్ బ్రాండ్ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంట్లోని ముఖ్య‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి త‌యారు చేసిన బెల్లం ర‌మ్‌ను ప్రీమియం ర‌మ్‌గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది.

News August 10, 2024

ప్రభాస్ ‘రాజా సాబ్’ చిన్న సినిమా కాదు: నిర్మాత

image

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘రాజాసాబ్’ను మాత్రం వీలైనంత సింపుల్‌గా, తక్కువ బడ్జెట్‌లో చేస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిని సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. అందరూ అనుకుంటున్నదానికంటే ఇది చాలా పెద్ద సినిమా అని ఆయన పేర్కొన్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుందని, పలు అంశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలిపారు.

News August 10, 2024

ఆర్మీ నిర్మించిన వంతెనపై ప్రధాని

image

వయనాడ్ (కేరళ)లో ప్రకృతి విధ్వంసాన్ని ప్రధాని మోదీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చూరల్మలా, ముండక్కై గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. అనంతరం ఆర్మీ నిర్మించిన వంతెనపై నడుస్తూ అక్కడ జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని భారత ఆర్మీకి చెందిన ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’ 36 గంటల్లోనే నిర్మించింది. దీంతో చూరల్మలా-ముండక్కై గ్రామాల మధ్య సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.