India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దిగ్గజ సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనిపై స్వయంగా ఆయనే స్పందిస్తూ.. ‘మొదట ఇది కేవలం నా వ్యక్తిగత ప్రయాణమే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది సంగీత ప్రియుల హృదయాలను హత్తుకునే కథగా రూపాంతరం చెందింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఇళయరాజాగా హీరో ధనుష్ కనిపించనున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. వీరిలో కొందరు ‘వన్ డే ఏ మీల్(OMAD)’ను అనుసరిస్తున్నారు. రోజుకు సరిపడా క్యాలరీలను ఒక నిర్ణీత సమయంలో తీసుకోవడం ఈ డైట్ ఉద్దేశమని నిపుణులు తెలిపారు. అంటే గంటసేపు ఈటింగ్ విండో, 23 గంటలు ఫాస్టింగ్ విండో అన్నమాట. ఇలా పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగవుతాయి. ఈ డైట్‌ని పాటించే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎంఎస్ ధోనీ, పవన్ కళ్యాణ్ ఫొటోలతో CDPని విడుదల చేశారు. ‘వీరు నా అభిమాన వ్యక్తులు. వారి విజయాలతో నన్ను ఎప్పుడూ ప్రేరేపించడంతో పాటు నాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. త్వరలో వీరిరువురూ తమ తమ రంగాలలో కొత్త అధ్యాయాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ CDPని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పరుశురామ్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుండగా విజయ్, మృణాల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా వీరు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృణాల్.. విజయ్‌తో సెల్ఫీ దిగారు.
లోక్‌సభ ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. APR 19, 26న పోలింగ్ ఉండటంతో ఆ 2 రోజులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంది. మరి ఇక్కడా సెలవు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఫోన్ కాల్ ద్వారా వీరు ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధం విషయం ప్రస్తావనకు రాగా చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. ఇరు పక్షాల మధ్య జరిగే శాంతి నెలకొల్పేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కాగా భారత్ అందిస్తున్న సాయానికి జెలెన్‌స్కీ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఆస్కార్ బరిలో నిలిచి ఏడు అవార్డులు గెలిచిన సినిమా ‘ఓపెన్‌హైమర్’ ఓటీటీలోకి రానుంది. రేపటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అణు బాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ఐపీఎల్ సీజన్-17 ఆరంభానికి సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ నెల 22న ఆర్సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోను నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఎల్లుండి సా.6.30 నుంచి లైవ్ ప్రారంభంకానుంది.
ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బయోపిక్‌లో నటించాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు. రజనీకాంత్, ఇళయరాజా అంటే తనకు ఇష్టమని.. వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నట్లు చెప్పారు. వీటిలో ఓ కల ఇప్పుడు నెరవేరిందన్నారు. ఇళయరాజాకు తానొక భక్తుడినని.. సీన్‌లో నటించే ముందు ఆయన మ్యూజిక్ వింటానని తెలిపారు.
Sorry, no posts matched your criteria.