India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్‌లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న ఈ జైలు ఆసియాలో అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ నుంచి గ్యాంగ్‌స్టర్లు ఫోన్లు వాడటం, బయటి వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.
1351: ఢిల్లీ సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
అంతర్జాతీయ సంతోష దినం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TG: వచ్చే నెల 13న ఇల్లినాయ్‌లో జరిగే సదస్సుకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భారత పారిశ్రామిక రంగంలో అవకాశాలు-సవాళ్లు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆయనకు లేఖ రాసింది. కాగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అమెరికా నార్త్ వెస్టర్న్ వర్సిటీ తెలిపింది.
తేది: మార్చి 20, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:08
సూర్యోదయం: ఉదయం గం.6:20
జొహర్: మధ్యాహ్నం గం.12:23
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేదీ: మార్చి 20, బుధవారం,
ఫాల్గుణము
శుద్ధ ఏకాదశి: తెల్లవారుఝామున 02:23 గంటలకు
పుష్యమి: రాత్రి 10:38 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:50-12:38 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 04:59-06:45 గంటల వరకు
* INDIA కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ
* TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
* కవిత కేసులో విచారణ జరుపుతున్న జడ్జి బదిలీ
* నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి
* AP: ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర
* కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్:పవన్
* కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్
* సివిల్స్ పరీక్ష జూన్ 16కు వాయిదా
టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగాకు ఐసీసీ షాకిచ్చింది. రీఎంట్రీ తర్వాత ఆడనున్న తొలి రెండు టెస్టులకు సస్పెండ్ చేసింది. ఈ నెల 18న బంగ్లాతో జరిగిన వన్డేలో అతడు అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డీమెరిట్ పాయింట్లతో పాటు 2 టెస్టులకు సస్పెండ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు హసరంగ దూరమయ్యారు.
2025 చివరిలోగా 20కిపైగా మోడళ్లను రిలీజ్ చేస్తామని ఆడీ సంస్థ వెల్లడించింది. 2027కు అన్ని మోడల్స్‌లోనూ EV వెర్షన్‌లను తెస్తామని తెలిపింది. 2024-2028 మధ్య తయారీకి ఏకంగా 41 బిలియన్ యూరోల (రూ.3.6లక్షల కోట్ల)ను ఖర్చు చేయనుంది. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికిల్స్ (PHEV) కోసం 11.5 బిలియన్ యూరోలు వెచ్చించనుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 29.5 బిలియన్ యూరోలు ఖర్చు చేయనుంది.
Sorry, no posts matched your criteria.