India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అయిందని, ముగ్గురు కలిసి పోటీ చేసినా జగన్‌ను ఓడించలేరని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘ప్రధాని పాల్గొన్న సభనే విజయవంతం చేయలేకపోయారు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావమే. మైక్ సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా? బాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవు. జనాలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు’ అని అంబటి అన్నారు.
చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం మెదడులో టేప్‌వార్మ్స్(బద్దె పురుగులు) పెరగడానికి ఓ కారణమని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ వెల్లడించాయి. ఈ బద్దె పురుగు కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి, అక్కడి నుంచి మెదడులోకి వెళుతుందట. ఉడకని పంది మాంసం తినేవారిలోనూ ఈ టేప్‌వార్మ్స్ గుర్తించినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ సమస్య ఉన్న వారి మలమూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది.
AP: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారు. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే ఇంటి నుంచి వారు ఓటు వేయవచ్చు. ఆ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు.
దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా 2 చిత్రాలను ప్రకటించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కార్తికేయ సంయుక్త నిర్మాణంలో రానున్న ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాల పోస్టర్లను పంచుకున్నారు. ఈ రెండింట్లోనూ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. ‘ఆక్సిజన్’కు సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈనెల 22వ తేదీ నుంచి మొదలయ్యే IPL-2024కు సంబంధించిన కామెంటేటర్స్ జాబితాను జియో సినిమా విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో సహా 13 భాషల్లో ఉచితంగా మ్యాచ్‌లు చూడొచ్చని తెలిపింది. తెలుగు కామెంటేటర్స్ వీళ్లే.. హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిశ్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, RJ కౌషిక్, సునితా ఆనంద్.
న్యూక్లియర్ వెపన్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంపై UN నిషేధం విధించే దిశగా అమెరికా, జపాన్ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై యూఎన్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. స్పేస్‌లోకి ఆయుధాలను పంపించడం మొదలైతే అది వినాశనానికి దారి తీస్తుందని జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికవా పేర్కొన్నారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్య దేశాలన్నీ ఇందుకు సహకరించాలని అమెరికా కోరింది.
AP: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ‘పిఠాపురంలో పోటీ చేయమని కొందరు అడుగుతున్నారు. ఇప్పటికే విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించా. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పును తీర్చేస్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా. ఎన్టీఆర్‌కు భారతరత్నఇచ్చే వరకు పోరాడుతా’ అని చెప్పుకొచ్చారు.
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన వదిన, జమా ఎమ్మెల్యే సీతా సోరెన్ బీజేపీలో చేరారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు. 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తనకు తగిన గౌరవం దక్కడం లేదని సీత ఆరోపించారు. ఆమె పార్టీని వీడటం దురదృష్టకరమని జేఎంఎం నేతలు చెప్పారు.
మలయాళం సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మాలీవుడ్ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్రకెక్కింది. అనుక్షణం ఉత్కంఠ కలిగించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Sorry, no posts matched your criteria.