News March 16, 2024

సిక్కింలో ఏప్రిల్ 19న ఎన్నికలు

image

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.

News March 16, 2024

BIG BREAKING: ఏపీలో ఎన్నికల తేదీ ఇదే

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

News March 16, 2024

బీజేపీలోకి గాయని అనురాధ పౌడ్వాల్

image

ఒకప్పటి ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ ఈరోజు బీజేపీలో చేరారు. సనాతన ధర్మంతో లోతుగా అనుబంధం కలిగిన రాజకీయ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఇది తన అదృష్టమని ఆమె తెలిపారు. ఆలయాల్లో వినిపించే ఓం జయ జగదీశ హరే, శివామృత వాణి, సాయి మహిమ వంటి భక్తిగీతాలతో పాటు 80, 90వ దశకాల్లో బాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె ఆలపించారు.

News March 16, 2024

ఒడిశా, అరుణాచల్, సిక్కిం 2019 రిజల్ట్స్

image

✒ ఒడిశా: అసెంబ్లీ స్థానాలు 147: BJD-112, BJP-23, INC- 9, CPM-1, ఇండిపెండెంట్-1.
ఎంపీ స్థానాలు-21: BJD-12, BJP-8, INC-1
✒ అరుణాచల్ ప్రదేశ్: అసెంబ్లీ స్థానాలు 60: NDA-41, JDU-7, NPP-5, INC-4, PPA-1, ఇండిపెండెంట్లు-2
2 ఎంపీ స్థానాల్లో BJP గెలిచింది.
✒ సిక్కిం: అసెంబ్లీ స్థానాలు 32: సిక్కిం క్రాంతికారి మోర్చా-17, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ -15
ఏకైక MP స్థానంలో సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది.

News March 16, 2024

ఓటర్లకు ఉపయోగకరమైన యాప్స్..

image

VHA: ఆన్‌లైన్‌లో ఓటర్ల దరఖాస్తు, నియోజకవర్గ మార్పు తదితరాలు చేసుకోవచ్చు. పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవచ్చు. మీ BLO/EROలతో కనెక్ట్ కావొచ్చు. e-EPIC కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
cVigil: ఎక్కడైనా హింస, అవాంఛనీయ సంఘటనలను డైరెక్ట్‌గా రికార్డు చేసి ఫిర్యాదు చేయొచ్చు. 100 నిమిషాల్లోనే స్పందన ఉంటుంది. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి.

News March 16, 2024

కొన్ని బంధాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి: పాండ్య

image

గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి హోమ్ టీమైన ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చిన హార్దిక్ పాండ్య ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తన మిత్రులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. తాజాగా ముంబై స్టార్ ప్లేయర్ పొలార్డ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు. మరింత బలపడతాయి. నా సోదరుడు పొలార్డ్‌తో కలిసి మళ్లీ పని చేయడానికి సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News March 16, 2024

ఎన్నికలు.. రాష్ట్రాలకు EC ఆదేశాలు

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు EC కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయాలి. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్‌గా ఎంపిక చేయాలి. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలి. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి’ అని సూచించింది.

News March 16, 2024

2024 ఎన్నికల సంవత్సరం: రాజీవ్ కుమార్

image

ఈసారి ప్రపంచం మొత్తం ఎన్నికల వైపే చూస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. 2024లో ఇండియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అందుకే ఈ ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

News March 16, 2024

దేశంలో సంవత్సరాల వారీగా ఓటర్ల వివరాలు

image

● 1999: 62 కోట్ల మంది
● 2004: 67cr
● 2009: 72cr
● 2014: 83cr
● 2019: 91cr
● 2024: 96.8cr

News March 16, 2024

దేశంలో ఓటర్లు ఇలా..

image

✒ మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు
✒ పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు
✒ యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు
✒ తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు
✒ దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు
✒ 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు
✒ 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు
✒ సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు
✒ ట్రాన్స్‌జెండర్లు 48,000