News March 31, 2024

భార్యాభర్తల మధ్య ఎన్నికల చిచ్చు

image

MPలోని బాలాఘాట్ లోక్‌సభ BSP అభ్యర్థి కంకర్ ముంజరే ఇంట్లో ఎన్నికలు చిచ్చు పెట్టాయి. అతని భార్య అనుభా ప్రస్తుతం కాంగ్రెస్ MLAగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేర్వేరు పార్టీలకు ప్రచారం చేస్తున్న తామిద్దరం ఒకే ఇంట్లో ఉండొద్దని శంకర్ తన భార్యకు చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇంట్లో ఎవరైనా ఒకరే ఉండాలని, ఆమెను వేరే చోటుకు వెళ్లాలని కండిషన్ పెట్టారట. దీంతో అనుభా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

News March 31, 2024

అమెరికా సైనిక స్థావరంలోకి చొరబడిన చైనీయుడు

image

అమెరికాలోని కాలిఫోర్నియాలో మెరైన్ కోర్ శిబిరంలోకి ఓ చైనీయుడు చొరబడటం కలకలం రేపింది. అనుమతిలేకుండా లోపలికి వచ్చిన అతడు, బయటికి వెళ్లేందుకు నిరాకరించడంతో సరిహద్దు నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చాడని, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కాగా.. గత ఏడాది చైనాకు చెందిన నిఘా బుడగలు అమెరికా గగనతలంలో కనిపించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

News March 31, 2024

ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అంశాలివే..

image

1985లో రాజీవ్‌గాంధీ 52వ రాజ్యాంగ సవరణతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక పార్టీ నుంచి MP, MLA, MLCగా గెలిచి మరో పార్టీలో చేరడం, విప్‌నకు వ్యతిరేకంగా సభలో ఓటు వేస్తే అనర్హతకు గురవుతారు. గెలిచిన పార్టీకి రాజీనామా చేసినప్పుడు, నామినేటెడ్ సభ్యులు పార్టీలో చేరినప్పుడూ చట్టం వర్తిస్తుంది. అయితే పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మరో పార్టీలో చేరినా, గ్రూపుగా ఏర్పడినా చట్టం వర్తించదు.

News March 31, 2024

అధికారం లేకపోతే క్షణం ఉండలేకపోతున్నారు

image

దేశవ్యాప్తంగా రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో తాము గెలిచి, పార్టీ ఓడితే వెంటనే అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అన్ని చోట్లా ఇదే తంతు. ఒక పార్టీని మించి మరో పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన సొంత క్యాడర్‌ను నట్టేట ముంచి నాయకులు స్వలాభం చూసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. అది అధికార పార్టీకి చుట్టంగా మారిందనే విమర్శలున్నాయి.

News March 31, 2024

సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్?

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ MP అభ్యర్థి దానం నాగేందర్‌ను మార్చనున్నట్లు సమాచారం. ఇటీవల హస్తం పార్టీలో చేరిన ఆయనను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం దానం ఖైరతాబాద్ MLAగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆదేశించినా ఆయన లెక్కచేయడం లేదు. దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్న హస్తం పార్టీ దానంను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News March 31, 2024

IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీలు

image

☛ షాన్ టైట్ (RR) 157.71 kmph – 2011
☛ లాకీ ఫెర్గూసన్ (GT) 157.3 kmph – 2022
☛ ఉమ్రాన్ మాలిక్ (SRH) 157 kmph – 2022
☛ అన్రిచ్ నోర్ట్జే (DC) 156.22 kmph – 2020
☛ ఉమ్రాన్ మాలిక్ (SRH) 156 kmph – 2022
☛ మయాంక్ యాదవ్ (LSG) 155.8 kmph – 2024

News March 31, 2024

ఉమ్రాన్‌కు మయాంక్‌కు తేడా ఇదే

image

నిన్న మ్యాచ్‌లో తీవ్రవేగంతో బౌలింగ్ చేసిన LSG బౌలర్ మయాంక్ పేరు అంతటా మారుమోగుతోంది. అయితే, అతడిలాగే SRH బౌలర్ ఉమ్రాన్‌ను కూడా గతంలో పైకి లేపారని, తర్వాత మాలిక్ ఫేడవుట్ అయిపోయారని నెట్టింట చర్చ నడుస్తోంది. కాగా.. ఉమ్రాన్‌తో పోలిస్తే మయాంక్ హైట్ ఎక్కువ కావడంతో అతడు మరింత సక్సెస్‌ కావొచ్చంటున్నారు విశ్లేషకులు. మాలిక్‌ది కేవలం వేగం కాగా, యాదవ్ బౌన్స్‌తోనూ వికెట్లు తీస్తున్నారని వివరిస్తున్నారు.

News March 31, 2024

BIG BREAKING: తప్పిన భారీ రైలు ప్రమాదం

image

TG: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. విచిత్రమైన శబ్ధం రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రైలును నిలిపివేసి పట్టా విరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. మరమ్మతులు చేసిన తర్వాత రైలు బయలు దేరింది. విరిగిన పట్టాను గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు.

News March 31, 2024

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు

image

నేడు ఈస్టర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యంలో ఉన్న శక్తిని, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహిమాన్వితమైన పర్వదినం ఈస్టర్’ అని ఏపీ సీఎం జగన్ పేర్కొనగా.. ‘మనుషుల్లో దేవుడిగా జన్మించి మానవత్వపు పరిమళాలను విశ్వవ్యాపితం చేసిన ఏసు క్రీస్తు స్మృతిలో జరుపుకునే వేడుక ఈస్టర్’ అని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

News March 31, 2024

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం: లోకేశ్

image

AP: తాము అధికారంలోకి రాగానే ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు. పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని, మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.