India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్ అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలిస్తోంది. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, OMR షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.
TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో రిలీజైన ‘పుష్ప-2’ టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. కానీ, ప్రభాస్ నటించిన ‘సలార్’ టీజర్ రికార్డులను బద్ధలు కొట్టలేకపోయింది. సలార్ టీజర్‌కు 1 మిలియన్ లైక్స్ వచ్చేందుకు 6.15 గంటలు పడితే.. ‘పుష్ప-2’ టీజర్‌కు 9.59 గంటలు పట్టింది. మూడో స్థానంలో RRR (36.04 గంటలు) నిలిచింది.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. మొత్తం 48 సీట్లలో శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) కు 21 సీట్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు అప్పగించారు. అలాగే ఎన్సీపీ (శరద్ పవార్) కి 10 సీట్లు దక్కాయి. కాగా ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య కొద్దిరోజులుగా సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సీట్లపై నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు తొలగిపోవడంతో సీట్లు ఖరారయ్యాయి.
AP: తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పం తీసుకుందామని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనేది తన ఆలోచన అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో TDP-JSP-BJP కూటమి 128 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లు గెలుస్తుందని పండితులు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన దేశంలో ఎక్కడికెళ్లినా CRPF జవాన్లు భద్రత కల్పించనున్నట్లు సమాచారం. జెడ్ కేటగిరీ కింద CEC వెంట నిరంతరం ఆరుగురు గన్‌మెన్లు ఉంటారు. అలాగే ఆయన ఇంటి వద్ద ఇద్దరు సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. విజయ్ తర్వాతి చిత్రంలో ఆయనకు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ నటించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఈ జోడీ ఖరారైనట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో విజయ్ పోలీస్‌గా కనిపిస్తారని సమాచారం.
ఒక పెళ్లి చేయడానికే తంటాలు పడుతున్న రోజులివి. అలాంటిది ఒకే ఇంట్లో 12 మంది మనవరాళ్లు, ఐదుగురు మనవళ్లకు 2 రోజుల్లోనే పెళ్లి చేశాడో తాత. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని సూర్జారామ్ గోదారా అనే వ్యక్తి తన సొంతింట్లోనే ఈ సామూహిక వివాహాలు జరిపించాడు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ వేడుక జరిగింది. అందరి పేర్లతో ఒకే శుభలేఖ ముద్రించడం విశేషం. అటు ఖర్చు తగ్గించడంతోపాటు వేడుక జీవితంలో గుర్తుండిపోయేలా చేశాడు.
బోర్డ్ ఎగ్జామ్స్ రాయనున్న తన కుమారుడికి ఈ ఏడాది చాలా కీలకమని లేఖలో కవిత పేర్కొన్నారు. తల్లిగా కుమారుడి పక్కన ఉండాల్సిన సమయమిదని తెలిపారు. తన చిన్న కుమారుడి పరీక్ష సమయంలో పక్కన లేకపోవడం అతనిపై ప్రభావం చూపిస్తుందనే భయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దయచేసి తన బెయిల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని జడ్జిని కోరారు.
తన బ్యాచ్‌మేట్ అయిన తెలంగాణ IPS అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోవడం పట్ల ACB డీజీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజీవ్ చనిపోయారనే వార్తతో నిద్రలేచాను. ఉగాది పండుగ రోజున ఇలాంటి బ్యాడ్ న్యూస్ వింటాననుకోలేదు. గత నెలలోనే మేము ఆల్ ఇండియా పోలీస్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్ వెళ్లాం. ఆయన భార్య, కుమారునికి నా ప్రగాఢ సానుభూతి. కేవలం ఆయన జ్ఞాపకాలే మిగిలాయి’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.