India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్‌గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX సినిమా కోసం ఈ లుక్‌లోకి మారినట్లు వెల్లడించారు. గతేడాది స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని, అప్పటి నుంచి తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆర్య తెలిపారు.
తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం BJPకి ఓటు వేయాలి. మరోసారి మా విజయం ఖాయం. NDAకు 400కు పైగా సీట్లు ఇవ్వాలి. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
AP: వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరతారని వెల్లడించాయి. కాగా తొలిసారి పవన్ పర్యటనకు వస్తుండటంతో జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసొస్తుందేమో చూడాలి.
WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్‌స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో అత్యంత వేగంగా మిలియన్ లైక్స్ పొందిన ఇండియన్ అకౌంట్‌గా RCB నిలిచింది. దీని తర్వాత కోహ్లీ పోస్టు (10 నిమిషాలు) ఉంది.
TG: సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన PSకు వెళ్లి అధికారి ద్వారా డబ్బు ఇప్పించాలని కోర్టులో పిల్ వేయాలి. అధికారి ఖాతాలు చెక్ చేసి.. బ్యాంకులు ఫ్రీజ్ చేశాయని గుర్తిస్తే, డబ్బును బాధితులకు ఇప్పిస్తున్నారు.
WPL-2024 ఫైనల్స్‌లో చివరి వరకూ పోరాడి ఓడిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు. కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీళ్లు పెట్టుకోగా.. ఇతర ప్లేయర్లు, స్టేడియంలోని DC అభిమానులు సైలెంట్ అయిపోయారు. ఓటమిని పక్కనపెట్టి చివరిసారిగా టీమ్ అంతా సరదాగా నవ్వుకుంటూ డిన్నర్ చేసిన ఫొటో వైరలవుతోంది. తాము పొందిన అనుభూతిని ఒకరికొకరు పంచుకున్నారు. ఓడినా.. మనసులు గెలిచారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
TG: రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్‌కు వివరించారు. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని, అటవీశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అధికారులను CM ఆదేశించారు.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ.వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ నిర్మాణ సేనకు బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. జొరమ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ(మిజోరం), అసోమ్ గణ పరిషద్(అస్సాం), CPI-ML, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ లిస్టులో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.