News March 17, 2024

నేడు ఢిల్లీ-బెంగళూరు మధ్య ఫైనల్ పోరు

image

WPLలో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అలాగే ఢిల్లీకి రెండోసారి. ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించనున్నారు.

News March 17, 2024

ఆ తెలుగు హీరో అంటే క్రష్: సమంత

image

తనకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే క్రష్ అని సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంది. ఇక బాలీవుడ్‌లో షారుఖ్ అంటే చాలా గౌరవం. నేను నటిగా ప్రయాణం మొదలుపెట్టి 14ఏళ్లు అయింది. బిజీ కారణంగా ఒక్కోసారి 5గంటలే పడుకునేదాన్ని. నా శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వలేదు. హెల్త్ బాగోక నటిగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్షణాలను ఎక్కువ ఆస్వాదించలేకపోయాను’ అని వెల్లడించారు.

News March 17, 2024

IPL సీజన్ మొత్తం భారత్‌లోనే: జైషా

image

ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేశారు. త్వరలోనే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహణపై వచ్చే వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. కాగా ఏప్రిల్‌లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. రెండో దశ షెడ్యూల్ మొత్తం UAEలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

News March 17, 2024

GTకి బ్యాడ్ న్యూస్

image

గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌ కీపర్‌ రాబిన్ మింజ్ ఈ ఏడాది IPL మొత్తానికి దూరమయ్యారు. ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడ్డ అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీజన్‌ మొత్తానికి మింజ్‌ దూరమైనట్లు కోచ్ ఆశిశ్ నెహ్రా తెలిపారు. కాగా IPL-2024 మినీ వేలంలో అతణ్ని రూ.3.60 కోట్ల భారీ ధరకు GT కొనుగోలు చేసింది.

News March 17, 2024

ముగిసిన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

image

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ చిహ్నం వద్ద రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు. రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ బహిరంగ సభ జరగనుంది. కాగా 63 రోజుల పాటు 6700 కి.మీ మేర రాహుల్ యాత్ర చేపట్టారు. మొత్తం దేశంలోని 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించారు.

News March 17, 2024

నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్

image

TS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి జాన్సన్ నాయక్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. వీరందరూ కవితను కలవనున్నారు. కాగా కవిత అరెస్ట్‌పై ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం.

News March 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 17, 2024

మార్చి 17: చరిత్రలో ఈ రోజు

image

1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
1973: నాటకరంగ ప్రముఖులు, కవి, రచయిత పెద్ది రామారావు జననం
1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
1963: వెస్టీండీస్ క్రికెటర్ రోజర్ హార్పర్ జననం
1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జననం

News March 17, 2024

గుడ్డు కూర చేయనందుకు ప్రియురాలి హత్య!

image

గుడ్డు కూర చేయలేదని ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసిన దారుణమిది. లలన్ యాదవ్, అంజలి జంట గురుగ్రామ్‌లో సహజీవనం చేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో ఇంటికొచ్చిన లలన్, అంజలిని గుడ్డు కూర చేయమన్నాడు. ఆమె పట్టించుకోలేదు. మద్యం మత్తులో ఉన్న లలన్ బెల్టు, సుత్తితో ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు. ఆ హింసకు అంజలి చనిపోయింది. లలన్‌ను వెంటనే అరెస్టు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

News March 17, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 17,
ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:10
సూర్యోదయం: ఉదయం గం.6:22
జొహర్: మధ్యాహ్నం గం.12:24
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:26
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.