News March 16, 2024

25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలనివ్వండి: రేవంత్ రెడ్డి

image

APకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని TS CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది MLAలు, ఐదుగురు MPలను ఇవ్వండి చాలు. షర్మిలమ్మ పోరాటం చేస్తారు. ఎవరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎలా పోలవరం పూర్తికాదో, ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారు’ అని అన్నారు.

News March 16, 2024

ప్రణీత్‌రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

image

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.

News March 16, 2024

ఈవీఎంలపై ఫిర్యాదులను కోర్టులు 40సార్లు కొట్టేశాయి: సీఈసీ

image

ప్రతి ఎన్నికలో ఈవీఎంల పనితీరుపై పలువురు వ్యక్తం చేస్తోన్న అనుమానాలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ‘ఇలాంటి ఫిర్యాదులపై కోర్టులు 40సార్లు విచారణ చేశాయి. ప్రతిసారీ ఆరోపణలన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలు సరళతరం చేశాయి. అవే ఈవీఎంలతో అధికారంలో ఉన్న పార్టీలూ ఓడిపోయాయి’ అని గుర్తు చేశారు.

News March 16, 2024

షర్మిల ఏపీ సీఎం అయ్యే వరకు తోడుగా ఉంటా: సీఎం రేవంత్

image

కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవడానికే వైఎస్ షర్మిల ఇక్కడకు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘అచ్చోసిన ఆంబోతుల్లా వారిద్దరూ(చంద్రబాబు, జగన్) తలపడుతుంటే ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం ఆషామాషీ కాదని ఆమెకు తెలుసు. అయినా సరే పోరాటం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు. ఆమె నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలి. ఆమె ఏపీ సీఎం పీఠంపై కూర్చునే వరకు నేను తోడుగా ఉంటా’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

జగన్, చంద్రబాబు ఢిల్లీలో మోదీ పక్కనే: సీఎం రేవంత్

image

ఏపీలో పాలకులు ఢిల్లీలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. ‘ఇక్కడి 25 ఎంపీ స్థానాలు మోదీ ఖాతాలోనే ఉంటాయి. జగన్, చంద్రబాబు రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నా.. ఢిల్లీలో మోదీ పక్కనే ఉంటారు. వారిద్దరూ పాలించాలనుకుంటున్నారు గానీ ప్రశ్నించాలనుకోవట్లేదు. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకులు కావాలి’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

ఏపీలోని మొత్తం ఓటర్లు 4.08 కోట్లు

image

➣రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య: 4,08,07,256
➣175 నియోజకవర్గాల్లో రిజర్వ్‌డ్ స్థానాలు: లోక్‌సభ(4 ఎస్సీ, ఒక ఎస్టీ), అసెంబ్లీ(29 ఎస్సీ, 7 ఎస్టీ)
➣పురుష ఓటర్లు: 2 కోట్లకుపైగా ➣మహిళా ఓటర్లు: 2.07 కోట్లకుపైగా
➣థర్డ్ జెండర్: 3,482 ➣సర్వీస్ ఓటర్లు: 67,434 ➣NRI: 7,603
➣మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు(PS):178 ➣యువతతో నిర్వహించే PSలు: 50 ➣555 ఆదర్శ PSలు.

News March 16, 2024

సీఎం జగన్‌పై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు

image

AP: దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.

News March 16, 2024

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష

image

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఓయోంగ్ సు(79)ను లైంగిక వేధింపుల కేసులో సౌత్ కొరియా పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు తేలడంతో కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. 40 గంటలపాటు లైంగిక వేధింపుల ట్రీట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆదేశించింది.

News March 16, 2024

IPL టికెట్ల అమ్మకం షురూ

image

హైదరాబాద్‌లో జరగబోయే IPL తొలి మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు <>పేటీఎం ఇన్‌సైడర్‌<<>>లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ల కనిష్ఠ ధర రూ.1500లుకాగా గరిష్ఠ ధర రూ.30 వేలుగా ఉంది. ఇక ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక ఫ్యాన్ జెర్సీ ఉచితంగా పొందవచ్చని SRH బంపర్ ఆఫర్ ప్రకటించింది.

News March 16, 2024

పదేళ్లయినా రాజధాని ఎక్కడో చెప్పలేకపోతున్నారు:రేవంత్

image

AP: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని విమర్శించారు.