India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు <<12656938>>ప్రాజెక్టు<<>> ఫస్ట్ ఫేజ్ 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు రైలును నడుపుతామని, అహ్మదాబాద్- ముంబై మార్గం 2028కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్‌ను తీసుకొస్తామన్నారు. ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశం ఐదో స్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
AP: 11 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు TDP సిద్ధమైనట్లు సమాచారం. శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, విజయనగరం-అశోక్ గజపతిరాజు, విశాఖ-భరత్, విజయవాడ-కేశినేని చిన్ని, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం-JC పవన్, హిందూపురం-పార్థసారధి, నంద్యాల-బైరెడ్డి శబరి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
హిందుత్వాన్ని అవమానించడంలో INDIA కూటమి నేతలు ఒక్క సెకన్ కూడా వృథా చేయరని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఆ రాష్ట్రంలోని అధికార DMKపైనా విమర్శలు గుప్పించారు. DMK, కాంగ్రెస్ ఏ ఇతర విశ్వాసాలను టార్గెట్ చేయవని, హిందువులను మాత్రం అవమానిస్తాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి, నారి శక్తి అని ఆయన వివరించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘రాజాసాబ్ సినిమాలో భారీగా VFX సన్నివేశాలు ఉంటాయి. మీరు ఊహించని విధంగా స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం కల్కి సినిమా ఉన్నందున దాని విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. రిలీజైన వెంటనే మా మూవీ కంటెంట్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తాం’ అని తెలిపారు.
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, మోదీ ప్రచారంలో రోడ్డుపై విద్యార్థులను మొహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్తాపత్రికల్లో దీనిపై కథనాలొచ్చాయని, ఎన్నికల ప్రచారంలో పిల్లలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని ఈసీ తెలిపింది. హెడ్ మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వివరణ ఇవ్వాలన్నారు.
తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు మాజీ గవర్నర్ తమిళి సై కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ & పుదుచ్చేరికి చెందిన సోదర, సోదరీమణులు, తల్లులు, పెద్దలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళి సై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెబల్ మూన్-పార్ట్-2: ది స్కార్‌గివర్ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన పార్ట్-1 అభిమానులను ఆకట్టుకోగా.. పార్ట్-2ని కూడా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
‘ఎల్ డొరాడో ఆఫ్ ది సీస్’గా పిలిచే బ్రిటన్ నౌక ‘ది మర్చంట్ రాయల్’ ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. బంగారం, వెండి నిధులను తరలిస్తుండగా 1641 సెప్టెంబరు 23న కార్న్‌వాల్ తీరాన ఈ నౌక నీట మునిగింది. అప్పుడు షిప్పులోని నిధుల విలువ రూ.42వేల కోట్లని అంచనా. దీని ఆచూకీ కోసం ఎంతోమంది విఫలయత్నం చేశారు. తాజాగా మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థ సోనార్ టెక్నాలజీ, మానవరహిత సబ్‌మెరైన్లతో అన్వేషణ చేపట్టేందుకు సిద్ధమైంది.
మరో మూడ్రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్లేయర్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆటతోనే కాకుండా తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. విరాట్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల సుజాతమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్‌ఛార్జ్‌లు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
Sorry, no posts matched your criteria.