India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.
AP: వైజాగ్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేశ్ తెలిపారు. ‘ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే బినామీ కంపెనీ పేరుతో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్?’ అని ట్వీట్ చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
హైతీలో హింస చెలరేగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టింది. 12 మంది భారతీయులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-Bలో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WCకి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.
AP: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై సీఈవోను ఈసీ నివేదిక కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని సభలో బ్లాంకు పాసులు ఇవ్వడం, పవర్ కట్‌పై టీడీపీ, జనసేన ఈసీకి ఫిర్యాదు చేశాయి.
IPLలో ధోనీ, రోహిత్ విజయవంతమైన కెప్టెన్లు. CSKకు ధోనీ, MIకి రోహిత్ సుదీర్ఘ కాలం సారథులుగా సేవలందించి అత్యధిక ట్రోఫీలను గెలిపించారు. తాజాగా ధోనీ CSK కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాస్ సందర్భంగా ధోనీకి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను హిట్‌మ్యాన్ పోస్ట్ చేశారు. ‘ఇద్దరు లెజెండ్‌లను తొలిసారి ప్లేయర్లుగా చూడబోతున్నాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆప్ సర్కార్ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఈ పాలసీని రూపొందించింది. 2022లో వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీ దీనిలో స్కామ్ జరిగిందని భావించి నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేశారు. అదే ఏడాది ఆయన CBI విచారణకు ఆదేశించారు. ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని భావించి ఈడీ కూడా దర్యాప్తులోకి ఎంట్రీ ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.