News March 22, 2024

BREAKING: బీజేపీ నాలుగో జాబితా విడుదల

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మందితో నాలుగో లిస్టును రిలీజ్ చేయగా.. అందులో 14 తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి స్థానాలున్నాయి. నటి రాధికాశరత్ కుమార్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు.

News March 22, 2024

దేశంలో మరింత తగ్గనున్న సంతానోత్పత్తి రేటు!

image

దేశంలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గనున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. 1950లో 6.2గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోయిందని పేర్కొంది. 1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5 కంటే ఎక్కువగా ఉందని, అది 2021లో 2.2కి తగ్గిందని వివరించింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి, 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది.

News March 22, 2024

మరో రెండు స్థానాలకు BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన

image

TG: నాగర్ కర్నూల్, మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్‌ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్‌ నుంచి మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా ఆరు సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది.

News March 22, 2024

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టారని, సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ దానంకు హైకోర్టు నోటీసులిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. కాగా ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

News March 22, 2024

6 చోట్ల మాత్రమే అభ్యర్థులు ఖరారు!

image

TG: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే, ఇప్పటివరకు రిలీజ్ చేసిన జాబితాల ప్రకారం కేవలం ఆరు చోట్ల మాత్రమే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పెద్దపల్లి, జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించాయి.

News March 22, 2024

సోమిరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడం సంతోషకరం: మంత్రి కాకాణి

image

AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సర్వేపల్లి టీడీపీ టికెట్ దక్కడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘సోమిరెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. సీనియర్ అని చెప్పుకునే ఆయనకు మూడో విడతలో టికెట్ రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే ఎవరిపై మాట్లాడాలి? విమర్శలు చేయాలి? అని అనుకున్నా. ఎట్టకేలకు ఆయనకు సీటు కేటాయించడంతో నాకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.

News March 22, 2024

టీడీపీకి బిగ్ షాక్?

image

AP: గుంటూరు జిల్లాలో TDPకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ TDPకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయించడంతో.. గుంటూరు-2, పెనమలూరు స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గుంటూరు-2 మాధవికి, పెనమలూరు బోడే ప్రసాద్‌కు CBN కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న రాజా.. సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించనున్నారు.

News March 22, 2024

కేజ్రీవాల్‌కు కస్టడీ తప్పదా?

image

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ CM కేజ్రీవాల్‌ను కాసేపట్లో ED అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయనను 10రోజుల కస్టడీకి ఇవ్వాలని ED కోరుతోంది. ఇటీవల కవితకు కోర్టు వారం రోజుల కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్‌కూ కస్టడీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా పేర్కొంటున్న సిసోడియా, కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారించేందుకు ఇదే సరైన సమయమని ED భావిస్తోంది.

News March 22, 2024

యాపిల్‌కు షాక్.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం

image

ఏకపక్ష విధానాలతో పోటీ సంస్థల మనుగడను ‘యాపిల్’ ప్రశ్నార్థకం చేస్తోందని, ధరలను కృత్రిమంగా పెంచుతోందని అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు) తగ్గిపోయింది. మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11 శాతం వరకు తగ్గడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.

News March 22, 2024

వైద్య శాస్త్రంలో అద్భుతం.. HIV ఎయిడ్స్‌కి చికిత్స రాబోతోంది

image

చికిత్స లేని వ్యాధుల్లో HIV ఎయిడ్స్ ఒకటి. తాజాగా సైంటిస్టులు CRISPR(క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్‌డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) సాంకేతికతతో కణాల నుంచి HIVని తొలగించే వీలుందని గుర్తించారు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో వైరస్ సోకిన జన్యువులను కత్తిరించి తీసేస్తారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో HIVకి చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు.