India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.
TG: గృహాజ్యోతి పథకానికి అర్హులై ఉండి, జీరో బిల్లు రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించింది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
భారత ప్రజలకు సుప్రీంకోర్టు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు CJI జస్టిస్ చంద్రచూడ్. కులం, మతం, లింగం, హోదాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ముందు ఏ కేసూ చిన్నది కాదని స్పష్టం చేశారు. సామాన్యులు న్యాయం కోసం మొదట జిల్లా కోర్టును ఆశ్రయిస్తారని అందుకే వాటిని సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 150 మంది జిల్లా కోర్టు జడ్జిలతో సమావేశమైనట్లు తెలిపారు.
ఏపీ పాలిసెట్ నిర్వహణ తేదీలో మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందన్నారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిసెట్‌ను మే 17 నుంచి 24వ తేదీకి మార్చారు.
పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ బేషరతు క్షమాపణలు చెప్పారు. సంస్థ ఉత్పత్తుల యాడ్స్ తప్పుదోవపట్టించేలా ఉండటంపై ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని భవిష్యత్తులో ఈ తప్పులు జరగవని వివరించారు. కాగా వ్యాధుల చికిత్సకు సంబంధించి పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది.
దేశంలో మాంస ప్రియుల సంఖ్య పెరిగిపోతోంది. 2015లో 74% మంది మాంసాహారులు ఉండగా, 2021 నాటికి 77 శాతానికి చేరినట్లు స్టాటిక్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. లక్షద్వీప్‌లో 100%, ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4% మంది మాంసాహారులు ఉన్నట్లు తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 96% మందికి ముక్కలేనిదే ముద్ద దిగట్లేదట. 7-15 రోజుల్లో ఒక్కసారైనా మాంసం తింటున్నారని పేర్కొంది.
IPL వేలంలో విదేశీ, స్వదేశీ ఆటగాళ్ల వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు చెల్లిస్తున్నాయి. త్వరలో దీనిపై సమీక్ష జరిపి, ప్లేయర్ ఆక్షన్ కోసం కొత్త విధానం తీసుకొస్తామని IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. త్వరలోనే ఫ్రాంచైజీలతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. గత మినీ వేలంలో స్టార్క్(KKR) ₹24.75 కోట్లు, కమిన్స్ (SRH) ₹20.5 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.
బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘పార్సిల్‌తో వచ్చిన ఓ డెలివరీ బాయ్‌కి తాగేందుకు నీరు ఇచ్చా.. తాగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే మళ్లీ వచ్చి బాత్రూమ్ వాడుకోవచ్చా? అని అడిగాడు. సరేనని లోనికి రానిస్తే బాత్రూమ్ నుంచి బయటకొచ్చి కిచెన్‌లో నా చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు. ప్రతిదాడి చేయడంతో పారిపోయాడు’ అని ఆమె చెప్పారు.
మనిషి పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి S1 అనే చిప్‌ను అమరుస్తారు. దీని వ్యాసం 8MM మాత్రమే. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుంది. చిప్‌లోని 3వేలకుపైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు. ఇవి న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే మెసేజ్‌లను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. అక్కడి నుంచి బయటకు కంప్యూటర్‌తో అనుసంధానించి ఆలోచనలను ప్రభావితం చేయొచ్చు.
TG: ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్‌లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59 అంతస్థులతో పుప్పాల్‌గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్‌క్రౌన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలే టాప్.
Sorry, no posts matched your criteria.