News March 19, 2024

IPL-2024: తెలుగు కామెంటేటర్స్ వీళ్లే

image

ఈనెల 22వ తేదీ నుంచి మొదలయ్యే IPL-2024కు సంబంధించిన కామెంటేటర్స్‌ జాబితాను జియో సినిమా విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో సహా 13 భాషల్లో ఉచితంగా మ్యాచ్‌లు చూడొచ్చని తెలిపింది. తెలుగు కామెంటేటర్స్ వీళ్లే.. హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిశ్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, RJ కౌషిక్, సునితా ఆనంద్.

News March 19, 2024

అంతరిక్షంలో అణ్వాయుధాలపై నిషేధం!

image

న్యూక్లియర్ వెపన్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంపై UN నిషేధం విధించే దిశగా అమెరికా, జపాన్ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై యూఎన్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. స్పేస్‌లోకి ఆయుధాలను పంపించడం మొదలైతే అది వినాశనానికి దారి తీస్తుందని జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికవా పేర్కొన్నారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్య దేశాలన్నీ ఇందుకు సహకరించాలని అమెరికా కోరింది.

News March 19, 2024

శృంగవరపుకోట నుంచి పోటీ చేయాలనుకుంటున్నా: కేఏ పాల్

image

AP: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ‘పిఠాపురంలో పోటీ చేయమని కొందరు అడుగుతున్నారు. ఇప్పటికే విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించా. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పును తీర్చేస్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా. ఎన్టీఆర్‌కు భారతరత్నఇచ్చే వరకు పోరాడుతా’ అని చెప్పుకొచ్చారు.

News March 19, 2024

బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ సీఎం వదిన

image

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన వదిన, జమా ఎమ్మెల్యే సీతా సోరెన్ బీజేపీలో చేరారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు. 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తనకు తగిన గౌరవం దక్కడం లేదని సీత ఆరోపించారు. ఆమె పార్టీని వీడటం దురదృష్టకరమని జేఎంఎం నేతలు చెప్పారు.

News March 19, 2024

రికార్డు సృష్టించిన మలయాళ సినిమా

image

మలయాళం సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మాలీవుడ్‌ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్రకెక్కింది. అనుక్షణం ఉత్కంఠ కలిగించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 19, 2024

రేపు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ

image

TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

News March 19, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736.38 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238.20 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమయ్యాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News March 19, 2024

కాపులకు మేలు చేసే హామీలు ప్రకటించండి: హరిరామ జోగయ్య

image

AP: కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన- బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టోలో కాపులకు మేలు చేసే హామీలు ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 10 హామీలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగినదే అని అన్నారు. అలాగే జనాభాలో 20 శాతం ఉన్న కాపులకు కూడా బీసీలకు చెప్పిన విధంగానే హామీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

News March 19, 2024

కోహ్లీని ప్రశంసిస్తే బాధపడుతున్నారు: ఇమాద్ వసీమ్

image

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ స్పిన్నర్ ఇమాద్ వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్. అతణ్ని ప్రశంసిస్తే పాక్ అభిమానులు బాధపడుతున్నారు. అయినా నిజం ఏంటంటే విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజమ్ కంటే గొప్ప ఆటగాడు’ అని వసీమ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.

News March 19, 2024

డిప్రెషన్ తగ్గేందుకే ఆ డ్రగ్ తీసుకుంటున్నా: మస్క్

image

డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కెటామైన్ అనే డ్రగ్‌ను తీసుకుంటున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దానిని సమర్థించుకున్నారు. ‘కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటా. దాని నుంచి బయటపడేందుకు డాక్టర్ సూచన మేరకు కొంత మోతాదులో కెటామైన్ తీసుకుంటున్నా. ఇది సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు ఉపయోగపడుతోంది’ అని తెలిపారు. కాగా మత్తుమందులా పనిచేసే ఈ కెటామైన్‌‌ను అతిగా వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.