India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆయా ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చే వరకు జారీ చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయ్యింది.
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం కొనసాగుతోంది. DMK నేత పొన్ముడిని మంత్రిగా నియమించాలంటూ CM స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. అవినీతి కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన మూడేళ్ల శిక్షపై సుప్రీం స్టే విధించడంతో ఆయన సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. దీంతో పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించాలంటూ CM లేఖ రాయగా, కేసును కొట్టేయనందున తిరస్కరిస్తున్నట్లు రవి స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు గతంలో ఆరోపించిన ఈడీ.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీ నమోదు చేసిన రాజకీయ వేధింపు కేసు అని బఘేల్ ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ వెల్లడించింది. ‘కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీసులు ఎందుకు పంపారు? ఈడీ సమన్లు చట్టవిరుద్ధం’ అని ప్రకటనలో పేర్కొంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘420(మోసాలు) పనులు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మాట్లాడుతున్నారు. వారు ఏ పార్టీ అయినా కావొచ్చు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. ఒక పార్టీ 400 సీట్లలో గెలవడం సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. కాగా తాము సింగిల్‌గా 370 సీట్లు, NDA కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
AP: చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిన్న జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘అందరం కలిసి సమిష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పనిచేద్దాం. నిన్నటి సభ ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడింది. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం’ అని వెల్లడించారు.
TG: ఖమ్మంలో దారుణం జరిగింది. చెవి కమ్మలు కొనలేదనే కోపంతో భర్తకు భార్య నిప్పంటించింది. తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు చెవి కమ్మలు కొనివ్వాలని భర్త యాకూబ్ పాషాతో సమీనా నిత్యం గొడవ పడుతూ ఉండేదని పోలీసులు తెలిపారు. తన దగ్గర డబ్బు లేదని, కొనలేనని పాషా చెప్పడంతో భార్య ఆగ్రహానికి గురై నిప్పంటించిందని చెప్పారు.
NEET UG-2024 దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 20న రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్స్‌లో కరెక్షన్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ పరీక్షను మే 5న ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈనెల 8తో నీట్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
AP: చిలకలూరిపేటలో TDP-JSP-BJP మీటింగ్ విఫలమైందని, ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘గతంలో ఇచ్చిన హామీల పరిష్కారంపై మాట్లాడలేదు. కొత్త హామీల ఊసెత్తలేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ విజన్ గురించి ప్రస్తావించలేదు. వారికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని Xలో మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.