News March 19, 2024

ఎన్నికల సమయంలో జనంలోనే జగన్: సజ్జల

image

AP: వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు అనుహ్య స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 28న నంద్యాల, 30న కర్నూలు(ఎమ్మిగనూరు)లో బస్సుయాత్ర, బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం ఇంటరాక్షన్ కార్యక్రమాలు, సాయంత్రం సభలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సభలు ఉంటాయన్నారు. వైసీపీ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ జనంలోనే ఉంటారన్నారు.

News March 19, 2024

తల్లి, పిల్లల్ని కలిసేందుకు కవితకు అనుమతి

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు తన తల్లి, పిల్లల్ని కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఆమె పిటిషన్‌పై విచారణను చేపట్టిన కోర్టు ఈమేరకు అనుమతి మంజూరు చేసింది. కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

News March 19, 2024

సమంత కొత్త సిరీస్ టైటిల్ ఫిక్స్

image

సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సిరీస్‌కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’(Citadel Honey Bunny) పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

News March 19, 2024

3 నెలల్లో 30వేల ఉద్యోగాలిచ్చాం: వేణుగోపాల్

image

TG: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌ అన్నారు. గ్రామీణ యువత, మహిళల సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలకు హామీలు ఇస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ప్రకటించిన గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. అదే విధంగా దేశ ప్రజలకు కూడా హామీలు ఇస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు.

News March 19, 2024

రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమలలో మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను కనువిందు చేయనున్నారు.

News March 19, 2024

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.420 పెరిగి రూ.60,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరగడంతో రూ.66,330గా ఉంది. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

News March 19, 2024

YELLOW ALERT: భారీ వర్షాలు

image

తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ NZB, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు, రేపు నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూ.గో., ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది.

News March 19, 2024

IPLలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కోహ్లీ

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ IPLలో అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థి టీమ్‌కు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడిన కింగ్.. 7263 పరుగులు చేశారు. కాగా ఏయే జట్టుపై కోహ్లీ ఎన్ని పరుగులు చేశారో తెలుసుకుందాం. DCపై 1030 రన్స్, CSK – 985, KKR- 861, PBKS- 861, MI-852, SRH-669, RR-618, GT-232, LSGపై 117 పరుగులు చేశారు.

News March 19, 2024

వంగవీటి రాధా ప్రచారానికే పరిమితమా? పోటీ చేస్తారా?

image

AP: ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన తరఫున వంగవీటి రాధా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుగుతారని సమాచారం. అయితే టీడీపీలో టికెట్ దక్కనందున జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఇవాళ ఎంపీ బాలశౌరితో సమావేశం కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

News March 19, 2024

24 గంటల వ్యవధిలోనే డీజీపీని మార్చిన ఈసీ

image

ఈసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న రాజీవ్ కుమార్ స్థానంలో వివేక్ సహాయ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. ఈసీ నిర్ణయం కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.