News March 19, 2024

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్ర కమాండర్ హతం

image

ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో హమాస్ అగ్ర కమాండర్ హతమయ్యారు. అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సలివాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. సెంట్రల్ గాజాలో జరిపిన గగనతల దాడిలో హమాస్ సైన్యం డిప్యూటీ కమాండర్ ఇస్సా మరణించాడని వెల్లడించారు. మిగిలిన అగ్ర కమాండర్లు సొరంగాల్లో దాక్కున్నారని తెలిపారు. హమాస్ సంస్థ టాప్ నేతల్లో ఇస్సా కూడా ఒకరని, అతడి మరణం ఇజ్రాయెల్‌కు పెద్ద విజయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

News March 19, 2024

ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి: కమలా హారిస్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన్ను ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా అభివర్ణించారు. ‘ట్రంప్ మన ప్రాథమిక స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. నేను, జో బైడెన్ కలిసి మన హక్కుల్ని కాపాడుతాం. తుపాకీ హింస సంస్కృతికి పరిష్కారాన్ని తీసుకొస్తాం. ట్రంప్‌నకు మాకు మధ్య వ్యత్యాసం సుస్పష్టంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News March 19, 2024

నీట్ దరఖాస్తులో సవరణలకు రేపే లాస్ట్

image

దేశవ్యాప్తంగా MBBS, BDS తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ దరఖాస్తులో సవరణలకు రేపు రాత్రి 11.59 వరకు అవకాశం ఉంది. అప్లై చేసినప్పుడు పొరపాట్లు చేసినవారు https://neet.nta.nic.in/లో లాగిన్ అయ్యి సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. మే 5న మ.2 నుంచి సా.5.20 వరకు పరీక్ష జరగనుంది. ఈసారి దాదాపు 21 లక్షల మంది పరీక్షకు హాజరవుతారని అంచనా.

News March 19, 2024

భీమిలిలో ‘గంటా’ గందరగోళం!

image

AP: గతంలో భీమిలి నుంచే గెలిచి మంత్రి అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు ఇవ్వాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. జనసేనలోకి చేరి అయినా భీమిలిని దక్కించుకోవాలనుకుంటున్నారట గంటా. అటు, జనసేన అభ్యర్థినన్న ధీమాతో పంచకర్ల సందీప్ ఇప్పటికే భీమిలిలో తిరుగుతున్నారు. దీంతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.

News March 19, 2024

ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టుకు కేఏ పాల్!

image

AP: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. ఎన్నికలకు, లెక్కింపునకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉందని, ఈవీఎం ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాదనలు విన్న కోర్టు, తగిన నిర్ణయాన్ని వెలువరించాలని సూచిస్తూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

News March 19, 2024

కడప TDP ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?

image

AP: వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.

News March 19, 2024

12 నెలల్లో 1.3 కోట్ల బిర్యానీలు తిన్నారు..

image

ఎన్నిరకాల వంటలున్నా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరికైతే రోజువారీ ఆహారంలో బిర్యానీ భాగమైంది. సిటీలోని 1,700కుపైగా రెస్టారెంట్ల నుంచి ఏడాదిలో 1.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. సెకనుకు 2.3 బిర్యానీలను కొనుగోలు చేశారని తెలిపింది. మీలో ఎంతమందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం?

News March 19, 2024

APPLY NOW.. 9,144 ఉద్యోగాలు

image

భారతీయ రైల్వే విడుదల చేసిన 9,144 రైల్వే ఉద్యోగాలకు <>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092, గ్రేడ్-3 పోస్టులు 8,052 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు టెన్త్, ITI, డిగ్రీ అర్హత ఉంది. 18-36 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు.. APR 8 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఫీజు SC, ST, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, మైనార్టీలు, EBCలకు రూ.250, మిగతా వారికి రూ.500. పరీక్ష రాశాక రీఫండ్ వస్తుంది.

News March 19, 2024

సర్ఫరాజ్, జురెల్‌కు జాక్‌పాట్

image

టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు BCCI సెంట్రల్ కాంట్రాక్టు లభించింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్టు ఇస్తున్నట్లు BCCI ప్రకటించింది. గ్రేడ్-సీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు మరో 15 మంది క్రికెటర్లు గ్రేడ్-సీ కాంట్రాక్టులో ఉన్నారు.

News March 19, 2024

నేడు కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌తో పాటు మహిళలను ఈడీ ఆఫీసుకు విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది. ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఇవాళ మూడో రోజు ఈడీ ఆమెను పలు అంశాలపై ప్రశ్నించనుంది.