News March 20, 2024

మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

image

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

News March 20, 2024

విజయ్‌తో మృణాల్ సెల్ఫీ

image

‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పరుశురామ్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుండగా విజయ్, మృణాల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా వీరు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృణాల్.. విజయ్‌తో సెల్ఫీ దిగారు.

News March 20, 2024

పోలింగ్ రోజు ఆ రాష్ట్రంలో సెలవు

image

లోక్‌సభ ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. APR 19, 26న పోలింగ్ ఉండటంతో ఆ 2 రోజులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంది. మరి ఇక్కడా సెలవు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.

News March 20, 2024

జెలెన్‌స్కీ‌కి ప్రధాని మోదీ ఫోన్ కాల్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఫోన్ కాల్ ద్వారా వీరు ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధం విషయం ప్రస్తావనకు రాగా చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. ఇరు పక్షాల మధ్య జరిగే శాంతి నెలకొల్పేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కాగా భారత్ అందిస్తున్న సాయానికి జెలెన్‌స్కీ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

News March 20, 2024

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ

image

ఆస్కార్ బరిలో నిలిచి ఏడు అవార్డులు గెలిచిన సినిమా ‘ఓపెన్‌హైమర్’ ఓటీటీలోకి రానుంది. రేపటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అణు బాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.

News March 20, 2024

అదిరిపోనున్న ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు

image

ఐపీఎల్ సీజన్-17 ఆరంభానికి సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ నెల 22న ఆర్సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోను నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఎల్లుండి సా.6.30 నుంచి లైవ్ ప్రారంభంకానుంది.

News March 20, 2024

ఆయనకు నేనొక భక్తుడిని: ధనుష్

image

ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బయోపిక్‌లో నటించాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు. రజనీకాంత్, ఇళయరాజా అంటే తనకు ఇష్టమని.. వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నట్లు చెప్పారు. వీటిలో ఓ కల ఇప్పుడు నెరవేరిందన్నారు. ఇళయరాజాకు తానొక భక్తుడినని.. సీన్‌లో నటించే ముందు ఆయన మ్యూజిక్ వింటానని తెలిపారు.

News March 20, 2024

కంచుకోటను దక్కించుకునేందుకు బరిలో నిలుస్తారా? – 1/2

image

గత ఎన్నికల్లో చేజారిన అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థిగా ఎవరనేది చర్చనీయాంశమైంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న రాహుల్ మరోసారి అమేథీలోనూ నిలబడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయట. మరోవైపు ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ సీటు ఖాళీ అయింది. ఇక్కడ ప్రియాంక గాంధీ బరిలో దిగే అవకాశం ఉంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News March 20, 2024

కంచుకోటను దక్కించుకునేందుకు బరిలో నిలుస్తారా? – 2/2

image

గాంధీ కుటుంబం, కాంగ్రెస్ ఆ ప్రాంతాలపై పట్టు నిలుపుకోవాలంటే వీరు బరిలోకి దిగి గెలవాల్సిన అవసరం ఉందనేది విశ్లేషకుల మాట. ఈ సీట్లు కాంగ్రెస్ భవిష్యత్తును శాసిస్తాయంటున్నారు. అమేథీని దక్కించుకుని, రాయ్‌బరేలీలో విజయ పరంపర కొనసాగిస్తే అది పార్టీ బలోపేతంలో కీలకం అవుతుందంటున్నారు. కానీ మారిన రాజకీయ పరిస్థితులతో ఇక్కడ గెలుపు సులువు కాదంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News March 20, 2024

రోహిత్‌పై పార్థివ్ ప్రశంసల వర్షం

image

ముంబై మాజీ సారథి రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. CSK సారథిగా ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ రోహిత్ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదన్నారు. హార్దిక్, బుమ్రాను యాజమాన్యం పక్కనపెట్టాలని భావించినా.. రోహిత్ మద్దతుగా నిలిచారన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో భాగమయ్యారని తెలిపారు. రోహిత్ కెప్టెన్సీలో MI రెండు సార్లు ఒక పరుగు తేడాతో కప్ గెలిచిందన్నారు.