India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ‘లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేశాం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది. ఆప్ నేతలకు వంద కోట్లు చేర్చారు. 240 చోట్ల సోదాలు చేశాం. రూ.128 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌లతో కవితకు సంబంధం ఉంది’ అని తెలిపింది.
తాను విచారణకు రాలేనని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఈడీకి లేఖ రాశారు. ఈ కేసులో అనిల్ ప్రమేయం ఉందా? లేదా? అని విచారించేందుకు 3 రోజుల క్రితం ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం అని తెలిపింది.
TS: రాష్ట్రంలో 2019లో లోక్‌సభ ఎన్నికలు మొదటి ఫేజ్‌లోనే నిర్వహించగా.. ఈ సారి 4వ ఫేజ్‌కు మార్చడంపై రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘమే దీనిపై సమీక్షించి, నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో వారే డిసైడ్ చేశారని పేర్కొన్నారు.
AP: అవినీతి అనే కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి నాగబాబు విమర్శించారు. ‘అవినీతి కిరీటాన్ని మాక్కావాలి అంటూ పోటీ పడుతున్న మీరు మా సభలని విమర్శిస్తున్నారు. ఎలా నవ్వాలో తెలియట్లేదు. ప్రజాగళం సభలో మైకు ఫెయిల్, మీటింగు ఫెయిల్ అని మొరిగే మూర్ఖులంతా విన్నారా.. ప్రధాని మోదీ నిన్న మీకు ‘భ్రష్టాచార్’ అనే బిరుదు నిచ్చారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
చైనాకు దీటుగా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తోందని నిపుణులు పేర్కొంటున్న వేళ మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఏడాదికి సగటున 8-10% సాధించిన చైనా ఆర్థిక వృద్ధికి భారత్ సాటి రాలేదని పేర్కొంది. అయితే 6.5-7% సగటుతో భారత్ తన వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేసింది. మౌలిక వసతులు, నైపుణ్యాల్లో కొరత భారత్ ఆర్థికవృద్ధి జోరుకు అడ్డుపడుతున్నాయని తెలిపింది.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాక కుటుంబసభ్యులతో కలిసి చిత్రహింసలకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై స్పందించారు. ‘ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. కాగా, తమిళిసై తమిళనాడు నుంచి ఎంపీగా పోటీచేయనున్నట్లు సమాచారం.
AP: రెండు రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు రెండు జాబితాల్లో కలిపి 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను CBN ప్రకటించారు. మిగిలిన 16 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలోని పలు చోట్ల వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మారిన వాతావరణంతో రిలాక్స్ అవుతున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.